‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాదంపై వర్మ సంచలన ట్వీట్: భయపడుతున్నారా? పప్పు ఫాదర్ అని రుజువైంది!
Recommended Video
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని మే 1న ఏపీలో విడుదల చేయబోతున్న సందర్భంగా మీడియాతో సమావేశం కావడానికి ఆదివారం విజయవాడ వెళ్లిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. వారు ఏర్పాటు చేయబోయే మీటింగ్ వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుందని, రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడే అవకాశం ఉందనే కారణాలు చెబుతూ వారిని విజయవాడ సిటీలో అడుగుపెట్టనీయకుండా గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలోనే అడ్డుకుని వెనక్కి పంపించేశారు.
దాదాపు 7 గంటల పాటు హైడ్రామా అనంతరం చిత్ర బృందం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జవీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విజయవాడ పోలీసులకు 16 ప్రశ్నలు సంధించారు. వీటికి 16 గంటల్లో సమాధానం ఇవ్వకపోతే కోర్టుకు వెళతానని హెచ్చరించారు.
రామ్ గోపాల్ వర్మ హెచ్చరిక
రామ్ గోపాల్ వర్మ తన 16 ప్రశ్నల ద్వారా ఏపీ పోలీసులు పౌరుడిగా తన హక్కులు హరించారంటూ ఫైర్ అయ్యారు. విజయవాడ వెళ్లకుండా తనను అడ్డుకున్న పోలీసులు... పై నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారే తప్ప ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరో చెప్పడం లేదంటూ మండి పడ్డారు.

చంద్రబాబు నాయుడుని సూటిగా ప్రశ్నించిన వర్మ
ఈ సందర్బంగా రామ్ గోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సూటిగా ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా స్వేచ్ఛ, హక్కులు హరించివేయబడ్డాయి... మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక నియంతృత్వ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా?'' అంటూ ఫైర్ అయ్యారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో జరిగిన పరిణామాలను జగన్ ఖండించడంపై
ఈ సందర్భంగా ఓ ట్వీట్లో వర్మ వైసీపీ అధినేత జగన్ గురించి ప్రస్తావించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మ్యాటర్లో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరించిన విధానాలను ఖండించిన జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్నట్లు వెల్లడించారు.

భయపడుతున్నారా? లోకేష్ పప్పు ఫాదర్ అని రుజువైంది
‘‘సార్ నారా చంద్రబాబు నాయుడుగారు... మీకు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు, అలాంటి మీరు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను చూసి భయపడుతున్నారా?... జరిగిన పరిణామాలు చూస్తుంటే మీరు నిజంగా లోకేష్ పప్పు ఫాదర్ అని ప్రూవ్ అయింది'' అంటూ వర్మ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











