ఇక ఇప్పుడు ఆ అధ్బుత చిత్రం రంగుల్లోకి!?

By Srikanya

మాయాబజార్ చిత్రం రంగుల్లోకి మార్చి సక్సెస్ కొట్టడంతో తాజాగా మూగ మనసులు చిత్రాన్ని కూడా రంగుల్లోకి మార్చటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఈ ప్రయత్నంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. క్కనేని, సావిత్రి, జగ్గయ్య, జమున, పద్మనాభం వంటివారు నటించిన ఈ చిత్రంలో అప్పట్లో సంచలన విజయం నమోదు చేసింది. ఇప్పటికీ పునర్జన్మ కాన్సెప్టులకు రిఫెరెన్స్ గా కనపడుతోంది. ఈ చిత్రం ప్రేరణతో అప్పట్లో రాఘవేంద్రరావు జానికి రాముడు చిత్రం రూపొందించి హిట్ కొట్టారు. నాగార్జన, విజయశాంతి, మోహన్ బాబు నటించారు. ఇక ఈ రకంగా కలర్స్ అద్దడంతో పెట్టే ఖర్చులో మేజర్ షేర్ శాటిలైట్ రైట్స్ ద్వారా రావటం కూడా ఈ ప్రయత్నానికి ఊతం ఇస్తోంది. ఎందుకంటే మాయాబజార్ చిత్రానికి రెండు కోట్ల డబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టి కలర్ చేస్తే కోటి పై చిలకు శాటిలైట్ రైట్స్ పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే పాతాళ భైరవి, గుండమ్మ కథ వంటి మరిన్ని ఆ పాత మధురాలు రంగులతో మళ్ళీ బాక్సాఫీస్ ని కళకళ్ళాడిస్తాయనటంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X