తెలంగాణ వాదులను బుట్టలో పడేసిన జూ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్..
ఇటీవల కాలంలో తెలంగాణ పేరుతో చాలా మంది సినిమాలు ఆడకుండా చేసిన విషయం అందిరికి తేలిసిందే. మొదటగా ఎన్టీఆర్ అదుర్స్ ఆతర్వాత అల్లు అర్జున్ ఆర్య-2 సినిమాలు తెలంగాణ వాదులు అడ్డుకోవడం మనం అందరం చూశాము. అప్పటినుండి తెలంగాణ వాదులను ఎలా బుట్టలో వేసుకోవాలా అని అందరూ హీరోలు ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కెసిఆర్ ప్రాపకానికి తహాతహాలాడడం కూడా మనకు తెలిసిన విషయమే.
ఇలాంటి అన్నింటిని తట్టుకునే విధంగా ఉండాలంటే తెలంగాణలోని పేరు ప్రఖ్యాతులున్న ప్రముఖ వ్యక్తి కూతురిని మన కుర్ర హీరో పెళ్శి చేసుకోని తెలంగాణ వాదుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరా ఆకుర్ర హీరో అని అనుకుంటున్నారా ఇంకెవరూ మన అల్లు అర్జున్. అల్లు అర్జున్ కాబోయే భార్య స్నేహారెడ్డి తండ్రి కెసిఆర్ కుమంచి మిత్రుడని సమాచారం. అంతేకాకుండా ఇక మీదట తన అల్లుడి సినిమాలకు ఎటువంటి ఆటంకాలు సృష్టించకూడదని కెసిఆర్ దగ్గర నుంచి ప్రమాణం కూడా తీసుకన్నాడని సమాచారం. దాంతో మన యువ హీరో మనసు కోంచెం కుదుటపడిందని ఫిలిమ్ వర్గాల సమాచారం.
ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ హీరోగా చేసిన "బృందావనం" చిత్రం నైజాంలో టాప్ ఫైవ్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలబడిందని దిల్ రాజు చెప్తున్నారు. అందుకే నిజామాబాద్ లో ఈ చిత్రం యాభై రోజుల పంక్షన్ కి ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ పంక్షన్ లో పాల్గొనటానికి ఒప్పుకున్నారని తెలిపారు. ఇక బృందావనం చిత్రం నైజాం ఏర్పాటు చేయటానికి కారణం దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి తెలంగాణా ప్రాంతానికే చెందిన వారు కావటమే కాకుండా ఆ ప్రాంతాల్లో ఎన్టీఆర్ తన సినిమాలకు భవిష్యత్ లో సమస్యలు రాకుండా చూసుకునేందుకు కూడా నిజామాబాద్ ని ఎన్నుకున్నట్లు చెప్తున్నారు.
అంతేకాకుండా ఇటీవల జగపతిబాబు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'చట్టం ఎవడబ్బు సోత్తు' అనే చిత్రానికి గెస్ట్ గావచ్చినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత ఇకమీదట తెలుగు సినిమాలు విడుదలను తాము అడ్డుకోమని చెప్పడంతో సినీ పరిశ్రమ అంతా కోంచెం ఊపిరి పీల్చుకుంది..


Click it and Unblock the Notifications











