twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక ఊసరవెల్లి వంతు వస్తోంది...ఇండస్ట్రీ టాక్...?!

    By Sindhu
    |

    దూకుడు సినిమా దుమ్ము దులిపేస్తూ ఉండడంతో రాబోయే మరో భారీ చిత్రం ఊసరవెల్లిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం దూకుడుకి ఎంత వరకు సరితూగగలదనేది ఆసక్తికరమైంది. ఈ నేపథ్యంలో ఊసరవెల్లి అసలు ఎలా ఉందని ఆరాలు తీస్తున్నవారి సంఖ్య పెరిగింది. అక్టోబర్ 6న రాబోతున్న ఈ చిత్రం గురించి ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఎంటో చూద్దామా..

    యంగ్ టైగర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తారని అందరికి తెలిసిందే. ఊసరవెల్లి ప్రోమోస్ కూడా దీనినే నిరూపిస్తున్నాయ్. ఈ చిత్ర టైటిల్ చెబుతున్నట్టుగానే ఎన్టీఆర్ కూడా ఆయా పాత్రల్లో ఒదిగిపోయినట్టు ప్రోమోస్ చూస్తే అర్థమౌతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మేనరిజం చాల డిఫరెంట్ గా కనిపిస్తుంది. 'ఊసరవెల్లి" చిత్ర కథ రెగ్యులర్ ఎన్టీఆర్ చిత్రాల కథలా ఉండదట. వెరైటీ కథ, ఊహించని కథనం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు. దానికి తోడు ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గ మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో చాలానే ఉన్నాయని చెబుతున్నారు. ఆడియో పరంగా ఇప్పటికే మూడు నాలుగు పాటలు క్లిక్ కాగా తెరపై కూడా ఆ పాటలు ఆకట్టుకుంటున్నాయట.

    ఇక డైలాగ్స్ అయితే అదుర్స్ అంటున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాని మాంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించి ఉంటాడనే టాక్ నందమూరి అభిమానుల్లో ఉంది. ఈ సినిమా చాలా పవర్ ఫుల్ డైలాగ్లు ఉన్నాయట. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కు సంబంధించి ఓ పవర్ ఫుల్ డైలాగ్ ఉందని తెలుస్తోంది. 'స్కెలిటన్ నుండి ఒక్కో నరం ఫార్మ్ అయ్యి...నరనరాల్లో వేడి, పౌరుషం, మంచి, చెడు, బాధ కలిసిన వాడే వీడు" అనేది ఇంట్రడక్షన్ డైలాగ్. డైలాగ్స్ పరంగాను, ట్రైలర్స్ పరంగానూ ఈ సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.

    ఊసరవెల్లి చిత్రం ఫస్టాఫ్ కాస్త కన్ ఫ్యూజింగ్ గా ఉన్నా కానీ సెకండాఫ్ లో మాత్రం ఊహించని మలుపులతో ఆద్యంతం కట్టి పడేస్తుందని టాక్. ఈ టాక్ ప్రకారం సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే అనిపిస్తోంది. ఇక రికార్డుల సంగతంటారా? అది ప్రేక్షకులు ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది.

    English summary
    Now, Oosaravelli is following Dookudu in positive buzz and high expectations. The inside buzz on Oosaravelli is positive which is a good sign for TFI. The Nandamuri fans have already stated their celebrations with Oosaravelli pre-censor report. The film’s run time is of 2 hrs 25 minutes [14.4 Reels].
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X