చిరు పార్టీకి ఎన్నారైల యాత్ర

తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు జరిగీన మహా యాత్ర దిగ్విజయమైందని,ప్రజలు అసంఖ్యాకంగా తరలి వచ్చారని హారతులు,కుంకుమ బొట్లతో స్వాగతం పలికారని,వర్షం పడుతున్నా ఏ మాత్రం లెక్క చేయక ప్రజలు చూపించిన ఆదరణతో ఉత్సాహంగా మహా యాత్రను విజయవంతం చేశారన్నారు.ప్రజలు తమ అభిమానం చాటుతూ కొన్ని చోట్ల డాన్సులు ,బాణాసంచాతో చిరంజీవి రాజకీయ ప్రవేషం ఆకాంక్షిస్తూ స్వాగతం పలికారు. అంచనాలను మించిన స్పందన లభించిందంటూ తెలుగ ఆర్గనైజైషన్ అధ్యక్షలు వడ్రాణం నరసయ్య మాట్లాడారు.యాత్ర అనంతరం హైదరాబాదు చేరుకుని చిరంజీవిని,నాగేంద్రబాబును కలిసి యాత్ర విశేషాలను వివరించారని తెలిపారు.


Click it and Unblock the Notifications











