RRRసెట్స్‌పై ఎన్టీఆర్ సందడి.. గుర్రంతో తంటాలు పడుతూ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్ని విషయాల్లోనూ యాక్టీవ్‌గా ఉంటారు. తన సినిమా సెట్స్ పై ఎన్టీఆర్ చేసే సందడి అంతా ఇంతా కాదు. తోటి నటీనటులతో ఉల్లాసంగా గడుపుతూ సరదా సరదాగా షూటింగ్ లో పాల్గొనడం ఎన్టీఆర్ స్టైల్. ప్రస్తుతం ఆయన చేస్తున్న భారీ ప్రాజెక్టు RRR. ఈ సినిమా సెట్స్ పై ఎంతో చురుకుగా మెదులుతున్న ఎన్టీఆర్.. ఓ గుర్రంతో సరదాగా ఆటలు ఆడారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

RRR మూడో షెడ్యూల్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న RRR మూవీ ప్రస్తుతం మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆసక్తికర సన్నివేశాలు చుడనున్నాం. ప్రస్తుతం ఆ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఓ గుర్రంతో ఫీట్స్ చేస్తూ కనిపించారు.
గుర్రంతో తారక్ తంటాలు
RRR మూవీని 1920 బ్యాక్ డ్రాప్‌లో చిత్రీకరిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఇందులో గుర్రపు స్వారీలు, భారీ యాక్షన్ సీన్స్ ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఈ సీన్స్ కొరకై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ గుర్రాన్ని మచ్చిక చేసుకోవాల్సి వచ్చింది. ఇందులో భాగంగా RRR సెట్స్ పై గుర్రాన్ని కంట్రోల్ చేస్తూ తారక్ పడుతున్న తంటాలకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

చెర్రీ, ఎన్టీఆర్ తర్వాత ఆలియాభట్
RRR షూటింగ్ లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకరి తర్వాత ఒకరు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సినిమా షూటింగ్ కొద్ది రోజులు ఆపేశారు కూడా. ప్రస్తుతం వారిద్దరూ కోలుకొని సెట్స్ పైకి రాగా.. ఊహించని రీతిలో ఆలియాభట్ అనారోగ్యం పాలై చికిత్స నిమిత్తం అమెరికా వెళ్ళింది. దీంతో ఆమె సంబందించిన షూట్ పక్కన బెట్టి మిగిలిన సన్నివేశాల చిత్రీకరణ జరపాలని ఫిక్స్ అయిందట చిత్ర యూనిట్.

ఎన్టీఆర్ హీరోయిన్
RRR చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా ఆలియా భట్ కన్ఫర్మ్ కాగా, ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ చేయబడలేదు. ప్రస్తుతం ఆమె వేటలో ఉన్నారు యూనిట్ సభ్యులు. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది జులై 30 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











