ఎన్టీఆర్‌కి నివాళులు : జూ ఎన్టీఆర్‌,కళ్యాణ్ రామ్, హరికృష్ణ(ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్‌ : తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామరావు 17వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. హరికృష్ణ, జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, కేంద్ర మంత్రి పురందేశ్వరి తదితరులు అంజలి ఘటించారు.

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో అమరజ్యోతి ర్యాలీ నిర్వహించనున్నారు. ఎన్టీఆర్‌ అఖిల భారత అభిమానుల సంఘం అధ్యక్షుడు శ్రీపతి రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీని తెదేపా అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ ప్రారంభిస్తారు.

ఎన్టీఆర్ కి నివాళలు : జూ.ఎన్టీఆర్‌,కళ్యాణ్ రామ్,హరికృష్ణ(ఫోటోలు)

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు.

ఎన్టీఆర్ కి నివాళలు : జూ.ఎన్టీఆర్‌,కళ్యాణ్ రామ్,హరికృష్ణ(ఫోటోలు)

ఈ ఉదయం జూ.ఎన్టీఆర్‌ దంపతులు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ కి నివాళలు : జూ.ఎన్టీఆర్‌,కళ్యాణ్ రామ్,హరికృష్ణ(ఫోటోలు)

చంద్రబాబు 63 ఏళ్ల వయస్సులో వస్తున్నా మీ కోసం పాదయాత్ర పేరిట సాహసం చేస్తున్నారని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. ఎన్టీఆర్ పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తుందని కల్యాణ్ రామ్ ఆకాంక్షించారు.

ఎన్టీఆర్ కి నివాళలు : జూ.ఎన్టీఆర్‌,కళ్యాణ్ రామ్,హరికృష్ణ(ఫోటోలు)

అవినీతి పైన మొదట పోరాడింది స్వర్గీయ నందమూరి తారక రామారావే అన్నారు. ప్రస్తుతం అవినీతి బాగా పెరిగిందని హరికృష్ణ అన్నారు. అవినీతిపై అందరూ పోరాడాలన్నారు. పేదలు బాగుపడాలంటే ఎన్టీఆర్ మళ్లీ పుట్టాలని హరికృష్ణ అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ కి నివాళలు : జూ.ఎన్టీఆర్‌,కళ్యాణ్ రామ్,హరికృష్ణ(ఫోటోలు)

బేగంపేట రసూల్‌పూరలో బాలకృష్ణ, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్‌ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ కి నివాళలు : జూ.ఎన్టీఆర్‌,కళ్యాణ్ రామ్,హరికృష్ణ(ఫోటోలు)

కేంద్ర మంత్రి పురందేశ్వరి తన భర్త తో తండ్రికి నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ కి నివాళలు : జూ.ఎన్టీఆర్‌,కళ్యాణ్ రామ్,హరికృష్ణ(ఫోటోలు)

నందమూరి లక్ష్మి పార్వతి ...ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు

ఎన్టీఆర్ కి నివాళలు : జూ.ఎన్టీఆర్‌,కళ్యాణ్ రామ్,హరికృష్ణ(ఫోటోలు)

ఎన్టీఆర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో తప్పకుండా పాల్గొంటానని తెలిపారు.

ఎన్టీఆర్ కి నివాళలు : జూ.ఎన్టీఆర్‌,కళ్యాణ్ రామ్,హరికృష్ణ(ఫోటోలు)

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర ద్వారా పార్టీకి బలం పెరుగుతుందని సినీ నటుడు జూ. ఎన్టీఆర్‌ అన్నారు.

ఎన్టీఆర్ కి నివాళలు : జూ.ఎన్టీఆర్‌,కళ్యాణ్ రామ్,హరికృష్ణ(ఫోటోలు)

ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్న పాదయాత్రను పొడిగించాలన్న ఆలోచన మంచిదేనని అన్నారు.

సినీనటుడు నందమూరి బాలకృష్ణ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. రసూల్‌పురాలోని ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి ప్రారంభయ్యే ర్యాలీ ఎన్టీఆర్‌ ఘాట్‌ వరకు కొనసాగుతుందని తెదేపా మీడియా వ్యవహారాల ఇంఛార్జి ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X