ఎన్టీఆర్ న్యూ మూవీ ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్టుగా పవన్ కళ్యాణ్
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరుగనుంది. ఈ ప్రారంబోత్సవ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్టుగా హాజరవుతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ఎస్ రాధాకృష్ణ(చిన బాబు) నిర్మించబోతున్నారు.
ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం సోమవారం (అక్టోబర్ 23)న హైదరాబాద్ లో జరుగబోతోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ధృవీకరించింది.

ఎన్టీఆర్-పవన్ మధ్య స్నేహం
ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. దీంతో పాటు ప్రస్తుతం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని కూడా హారిక & హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థపై తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ చిత్ర ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ తొలి మూవీ
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తొలి మూవీ. అటు ఎన్టీఆర్, ఇటు త్రివిక్రమ్ వరుస సక్సెస్‌లతో మంచి జోరు మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అనిరుధ్ రవిచందర్
త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు... ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు కూడా యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఇందుకోసం ట్యూన్లు సిద్ధం చేస్తున్నట్లు అనిరుధ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

యాక్షన్ సినిమానా?
త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ యాక్షన్ మూవీ అని సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గడంతో పాటు ఫిజిక్ పరంగా పలు మార్పులు చేయబోతున్నాడని సమాచారం. అలాగే మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ తీసుకోబోతున్నాడట.


Click it and Unblock the Notifications











