NTR30 అఫీషియల్ అప్డ్‌డేట్.. నేషనల్ వైడ్‌గా ట్రెండ్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి గత రెండు మూడు రోజులుగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మామూలుగా అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోన్నాడని అధికారికంగా ప్రకటించారు. ఓ టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం అన్నీ తారుమారయ్యాయని తెలుస్తోంది.

అయినను పోయి రావలె..
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ సమ్మర్‌లో పూర్తి అవుతుందని, అంతలోపే మిగతా ప్రాజెక్ట్‌లకు కూడా లైన్‌లో పెట్టేయాలని అనుకున్నాడు. అందుకే త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో మంతనాలు పెట్టేశాడు. ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టేశాడు. త్రివిక్రమ్‌తో అయినను పోయి రావలె హస్తినకు అనే సినిమాకు చేయబోతోన్నట్టు వార్తలు వచ్చాయి.

అనూహ్యంగా అలా..
జూన్ జూలై నెలలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కాబోతోందని ఆ మధ్య నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించాడు. అయితే ఇప్పుడు సమీకరణాలు మారినట్టు కనిపిస్తోంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ క్యాన్సిల్ అయినట్టు కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడల్లా ఉండకపోవచ్చని తెలుస్తోంది.

తెరపైకి కొరటాల..
ఎన్టీఆర్ 30వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో కొరటాల శివ వచ్చాడు. ఈ మేరకు రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ 30వ చిత్రం రాబోతోందంటూ వార్తలు వైరల్ అవుతున్న ఈ తరుణంలో అఫీషియల్ ప్రకటన రాబోతోంది.

రేపే ప్రకటన..
రేపు సాయంత్రం ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతోంది. అన్ని ప్రశ్నలకు సమాధానం రేపు లభించిను అంటూ ఎన్టీఆర్ పీఆర్ టీం ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఆర్ 30 అనే హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. అయితే ఇందులో త్రివిక్రమ్, కొరటాల శివలతో సినిమా ఉంటుందా? లేదా? అనే విషయం క్లియర్‌గా తెలుస్తుంది. ఇక అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ప్రశాంత్ నీల్‌తో..
ఎన్టీఆర్ 30 ఎవరితో ఉన్నా కూడా.. 31వ చిత్రం మాత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలొనే ఉండబోతోందని తెలుస్తోంది. 30వ సినిమా కొరటాలతో ఉంటుందని, ఆ తరువాత 32వ ప్రాజెక్ట్ త్రివిక్రమ్‌తో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ఏది నిజమే రేపు సాయంత్రానికి తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











