Don't Miss!
- Sports
INDvsNZ : టీ20ల్లో గిల్ కథేం బాగలేదు.. పెదవి విరిచిన మాజీ దిగ్గజం
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
కళతప్పిన ఎన్టీఆర్ ఘాట్.. జూనియర్ ఆగ్రహం, బరువెక్కిన హృదయంతో అన్నయ్యతో కలిసి నివాళి!
Recommended Video
మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు జయంతి రోజు(మే 28)న ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాట్ అభిమానులు, టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులతో కిటకిటలాడుతుంది. ఎన్టీఆర్ ఘాట్ ప్రాంగణాన్ని పూలతో ముస్తాబు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. అయితే ఈ సారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఘాట్ ఎలాంటి అలంకరణ లేకుండా బోసిపోయి కనిపించింది. టీడీపీ శ్రేణుల హడావుడి కూడా తగ్గింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో కొందరు మాత్రమే ఘాట్ సందర్శనకు వచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ ఉదయమే ఘాట్‌ను సందర్శించి తాతయ్యకు నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ 96వ వర్ధంతి
ఎన్టీఆర్ 96వ జయంతి పురస్కరించుకుని అతి సాధారణంగా కనిపించింది. ఇతర జిల్లాల నుంచి తరలి వచ్చిన అభిమానులు ఘాట్ వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయక పోవడం చూసి విస్తుపోయారు. తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వారు ప్రతి ఏటా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటారని టాక్.

జూ ఎన్టీఆర్ ఆగ్రహం, ఆ తర్వాత పూలతో ముస్తాబు చేశారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్‌తో కలిసి ఘాట్‌ను సందర్శించారు. నివాళులు అర్పించిన అనంతరం అక్కడే కొంతసేపు కూర్చుని తాత జ్ఞాపకాలతో బరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలంకరణ లేకుండా కళతప్పినట్లు కనిపించిన ఆ ప్రాంగణం చూసి యంగ్ టైగర్ అసంతృప్తికి గురయ్యారు. యంగ్ టైగర్ ఆదేశాలతో ఆ తర్వాత కొంత సేపటికి ఎన్టీఆర్ ఘాట్ ప్రాంగణం పూలతో ముస్తాబైంది.

ఈ సారి హరికృష్ణ లేని లోటు...
ప్రతిసారి తన తండ్రి హరికృష్ణతో కలిసి ఇద్దరు సోదరులు ఘాట సందర్శించే వారు. అయితే ఈ సారి ఆయన లేని లోటు స్పష్టంగా కనిపించింది. గతేడాది సరిగ్గా ఇదే రోజు తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం హరికృష్ణ చెప్పిన మాటలను పలువురు అభిమానులు గుర్తు చేసుకున్నారు. ‘‘మనకు ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరి జీవిత చరిత్రలు పాఠ్యాంశాల్లో ఉన్నాయి. అలాగే తెలుగు జాతికై పోరాడిన నందమూరి తారకరామరావు జీవితంలో ముఖ్య ఘట్టాలు పాఠ్యాంశాల్లో చేర్చాలి'' అని హరికృష్ణ చెప్పిన విషయాన్ని వారు రివైండ్ చేసుకుంటున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీదే అందరి ఆశలు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులే ఎన్టీఆర్ ఘాట్ కళ తప్పడానికి కారణమని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ పార్టీని నిలబెట్టడంలో విఫలమైన నేపథ్యంలో ఇపుడు అందరి దృష్టి యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ వైపు మళ్లింది. ఈ పార్టీని కాపాడాలంటే తారకరాముడు రాజకీయాల్లోకి రావాల్సిందే అనే వాదన తెరపైకి వచ్చింది.