twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా స్వార్థం కూడా ఉంది, ఆ గాయం పచ్చిగానే, పార్టీ విషయం ఆలోచించలేదు: ఎన్టీఆర్

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ సినిమా ప్రమోషన్లలో బిజీ అయ్యారు. ఓ చానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తండ్రి పోయిన తర్వాత తాను తీసుకునే కుటుంబ బాధ్యతలు, టీడీపీ పార్టీ విషయంలో ఎలాంటి స్టెప్ వేయబోతున్నారనే అంశాలపై ఎన్టీఆర్ స్పందించారు.

    Recommended Video

    Aravinda Sametha Movie Had A Change
     రాముడిలా ఉండాలి, వీరుడు అయుండాలి

    రాముడిలా ఉండాలి, వీరుడు అయుండాలి

    త్రివిక్రమ్ మాట్లాడుతూ... నేను రాసుకున్న ‘అరవింద సమేత వీర రాఘవ' కథకు హీరో రాముడిలా ఉండాలి.. కానీ వీరుడు అయుండాలి. అపుడు నాకు ఎన్టీఆర్ తప్ప ఎవరూ కనిపించలేదు. అందుకే ఈ కథ ఆయనకే చెప్పాను... అన్నారు.

     పేలడానికి సిద్దంగా ఉన్న బాంబు లాంటి పాత్రలో

    పేలడానికి సిద్దంగా ఉన్న బాంబు లాంటి పాత్రలో

    ఎన్టీఆర్ ఎక్సప్లోజివ్ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో చూశాం. ఇంప్లోజివ్‌గా చేస్తే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో ప్రయత్నించాం. ఆల్రెడీ పేలిపోయిన బాంబు కంటే పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబు మనల్ని బాగా భయ పెడుతుంది. అలాంటి పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారని త్రివిక్రమ్ అన్నారు.

    నా స్వార్థం కూడా ఉందన్న ఎన్టీఆర్

    నా స్వార్థం కూడా ఉందన్న ఎన్టీఆర్

    త్రివిక్రమ్ కథ చెబుతున్నపుడు ఆయన కళ్లలో ఒక మెరుపు కనిపించింది. ఒక జెన్యూన్ ప్రయత్నం పెడదామనుకుంటున్నాను అనే ఒక ఆరాటం కనిపించింది. నా స్వార్థం ఏమిటంటే.. ఆయనతో చిత్రం చేస్తే అది నాకు గుర్తుండి పోవాలి. రేపు మా పిల్లలు, అమ్మకు, అభిమానులకు, ప్రేక్షకులకు గుర్తుండిపోవాలి. ఇలాంటి సెల్ఫిష్‌నెస్ నాది... అని ఎన్టీఆర్ అన్నారు.

    సినిమాలో చూపించేది ఏమిటంటే...

    సినిమాలో చూపించేది ఏమిటంటే...

    యుద్ధం తర్వాత ఏం జరుగుతుంది. దాన్ని తాలూకు రిఫ్లెక్స్ ఎలా ఉంటుంది. కొన్ని జీవితాలు గమ్యం లేకుండా ఎలా వెళ్లిపోతారు... అనే థాట్ నుండి ఈ కథ వచ్చింది. దానికి రాయలసీమ బ్యాగ్రౌండ్ అయితే బావుంటుంది అనిపించింది... అని త్రివిక్రమ్ తెలిపారు.

     రెగ్యులర్ ఫ్యాక్షన్ సినిమా కాదు

    రెగ్యులర్ ఫ్యాక్షన్ సినిమా కాదు

    ఇది రెగ్యుల్ ఫ్యాక్షన్ సినిమా కాదు. ఫ్యాక్షన్ జరుగుతున్న సమయంలో జరిగే కథ కంటే, యుద్ధం జరిగి ఇంకో యుద్ధం జరుగకుండా ఉండే మధ్య కాలంలో ఒక సంధి సమయంలో జరిగిన కథ. అందుకే రెగ్యులర్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోకి వెళ్లలేదు. అయితే రాయలసీమ తాలుకు ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేశాం... అని త్రివిక్రమ్ అన్నారు.

     నాన్న పోయిన గాయం ఇంకా పచ్చిగానే....

    నాన్న పోయిన గాయం ఇంకా పచ్చిగానే....

    కుటుంబ బాధ్యతల్లో నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక భర్తగా, ఒక తండ్రిగా, కొడుకుగా, తమ్ముడిగా నా బాధ్యతలు పెరిగాయి. కుటుంబాన్ని ఒక మనిషి ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాను. నాన్నగారు పోయి ఇంకా నెల కూడా కాలేదు. ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది.... అని ఎన్టీఆర్ తెలిపారు.

     లోపల చాలా మర్దన జరుగుతోంది

    లోపల చాలా మర్దన జరుగుతోంది

    సినిమాకు ఒక న్యాయం ఉంటుంది కాబట్టి, అది నాన్నగారు ఎప్పుడూ నమ్మారు కాబట్టి, ఈ రోజు ఇలా సినిమా ప్రమోషన్లలో కూర్చుని మాట్లాడుతున్నాను. నాకు నిజంగా లోపల చాలా మర్దన జరుగుతోందన్నారు ఎన్టీఆర్.

     టీడీపీ పార్టీ విషయంలో

    టీడీపీ పార్టీ విషయంలో

    నేను ఇప్పటి వరకు నాకు నేను కూర్చుని ఏమీ అనుకోలేదు నాన్నగారు పోయిన తర్వాత. పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. నాన్న లేరనే నిజాన్ని జీర్ణించుకుని ఎలా ముందుకు వెళ్లాలనే ఆలోచనే తప్ప ఆ తర్వాత ఏమిటనేది నాకు తెలియదు.... అని ఎన్టీఆర్ స్పష్టం చేశారు.

    English summary
    Aravinda Sametha releasing on October 11th all across the World. On this occasion, Trivikram and actor Jr NTR have shared their association with the film in an interview with a media channel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X