మహేష్ తో కోల్డ్ వార్ విషయమై ఎన్టీఆర్
మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ ల మధ్య కోల్డ్ వార్ జరుగుతన్నట్లుగా కొన్ని మీడియాలలో వస్తున్న వార్తలను జూ.ఎన్టీఆర్ ఓ ఛానెల్ తో మాట్లాడుతూ ఖండించినట్లు సమాచారం. ఆయన మాట్లాడుతూ.. తనకు మహేష్ మంచి స్నేహితుడుని,దూకుడు చిత్రం చూడాలనుకున్నానని,అయితే ఊసరవెల్లి ప్రమోషన్ లో చూడలేకపోయానని అన్నారు. అలాగే బిజీ షెడ్యుల్ లో ఉండటమే ఈ మధ్యన మహేష్ ని కలవలేకపోవటానికి కారణమని,ఇద్దరం ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీగా ఉన్నామని, అంతమాత్రానికి కోల్డ్ వార్ జరుగుతోందనుకోవద్దని క్లారిఫై చేసారు. ఇక దూకుడు చిత్రం, ఊసరవెల్లి చిత్రాలు రెండూ కొద్ది రోజుల తేడాలో విడుదల కావటంతో ఈ ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ ఉందని రూమర్స్ బయిలు దేరాయి.
ఇక దూకుడు చిత్రం తర్వాత మహేష్ ది బిజెనెస్ మ్యాన్ లో బిజీ అయ్యిపోయారు. ఆయన ముంబైలో షూటింగ్ లో ఉన్నారు. అలాగే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి కావాల్సి రావటం కూడా త్వరగా పూర్తి చేయాలనే టెన్షన్ లో మహేష్ ఉన్నారు. ఇక మరో ప్రక్క ఊసరవెల్లి చిత్రం అనుకున్నంత రేంజిలో విజయవంతం కాకపోవటంతో ఎన్టీఆర్ తన దృష్టి మొత్తం తన తదుపరి చిత్రం దమ్ము మీదే పెట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఎన్టీఆర్ కి మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











