»   » భారీ మొత్తంలో డబ్బు.... ఏం చేయాలో తెలియక తికమకపడ్డ జూ ఎన్టీఆర్!

భారీ మొత్తంలో డబ్బు.... ఏం చేయాలో తెలియక తికమకపడ్డ జూ ఎన్టీఆర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నేటి బర్త్ డే బాయ్, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 2001లో వచ్చిన 'నిన్ను చూడాలని' సినిమా ద్వారా హీరోగా తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామోజీరావు నిర్మించారు.

ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ రూ. 4 లక్షల  పారితోషికం అందుకున్నారట. 2001లో రూ. 4 లక్షల పారితోషికం అంటే పెద్ద మొత్తమే. అపుడు ఎన్టీఆర్ వయసు దాదాపు 20 సంవత్సరాలు. ఆ వయసులో అంత పెద్ద మొత్తంలో డబ్బు ఏం చేయాలో అర్థంకాక చాలా తికమకపడ్డాడట. ఇటీవల ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ విషయం చెప్పుకొచ్చారు.

చాలా చోట్ల దాచి

చాలా చోట్ల దాచి

రూ. 4 లక్షల డబ్బు కవర్ అందుకున్న తర్వాత మొద‌ట ఇంట్లో ఓ రహస్య ప్రదేశంలో దాచిపెట్టానని, అక్కడ సేఫ్‌ కాదనుకొని తర్వాత బాత్రూమ్‌లో పెట్టానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

చివరకు అమ్మ చేతికి

చివరకు అమ్మ చేతికి

బాత్రూమ్ లో డబ్బు పెడితే ఎవరైనా చూస్తారని కారు డాష్‌ బోర్డులో పెట్టానని, కారు డ్రైవర్‌ తీస్తాడేమో అని అక్కడ నుంచి కూడా తీసేశానని, చివరికి ఏం చేయాలో తెలియక త‌న త‌ల్లికి గిఫ్ట్‌గా ఇచ్చేశానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

పుట్టినరోజు వేళ... కొడుకు చేసిన పనికి మురిసిపోయిన ఎన్టీఆర్

పుట్టినరోజు వేళ... కొడుకు చేసిన పనికి మురిసిపోయిన ఎన్టీఆర్

పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ తో కలిసి దిగిన ఫోటోలను పోస్టు చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
NTR about his first remunaration. Being one among the top league stars in Tollywood, NTR must be earning at least 10 Crores per film now. But fans must be curious to know about his hard-earned remuneration for his first film as hero, Ninnu Chudalani. Apparently, NTR's remuneration for his first film was Rs. 4,00,000.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu