'ఊసరవెల్లి' రంగులు కాదు.. రాతల్ని మారుస్తుంది

By Srikanya

'ఊసరవెల్లి' అనే టైటిల్ ఈ సినిమాకు చక్కగా కుదురుతుంది. ఈ చిత్రంలో ఊసరవెల్లి రంగులు కాదు.. రాతల్ని మారుస్తుంది. అలాగని పొలిటికల్ సినిమా కాదు. పూర్తిస్థాయి ప్రేమకథని ప్రతిఫలించే వినోదాత్మకమైన చిత్రం. మామూలుగా కమర్షియల్ చిత్రాలకు మీనింగ్ ఉండదు. తొలిసారి నేను చేస్తున్న మీనింగ్‌ఫుల్ కమర్షియల్ సినిమా ఇది. మా తాతగారు వైవిధ్యమైన పాత్రలు చేశారు. నేను ఆయన బాటలోనే వెళ్తాను. కానీ కమర్షియల్ తనాన్ని చిత్రాల్లో వదలిపెట్టను అంటున్నారు ఎన్టీఆర్. ఆయన తాజా చిత్రం ఊసరవెల్లి రేపు(గురు వారం) విడుదల అవుతోంది. ఆ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ..."'అదుర్స్'తో నేను కూడా సాఫ్ట్‌గా లవర్‌బోయ్ పాత్రలు చేయొచ్చని అనిపించింది.

'బృందావనం' ఆ ఫీలింగ్‌ను ఇంకొంచెం స్థిరం చేసింది. 'ఊసరవెల్లి'లో అమ్మాయి వెంటపడుతూ కనిపిస్తాను. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం. కొత్త సినిమాలను నా నుంచి ఆశించే అభిమానులపై ఈ సినిమాను ఆదరించాల్సిన బాధ్యత ఉంచుతున్నాను.ఇంతకు ముందు చిత్రాల్లోలాగా 200 మందిని ఒకేసారి కొట్టేసే తరహా పాత్ర కాదు. కొట్టకుండా పనిచేసే తరహా. ఫైట్‌లు కూడా సందర్భానుసారంగా మెప్పిస్తాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణ. కరెంటు తీగలా సన్నగా ఉన్నాడని... డైలాగు పేలింది. ఇంకా మంచి డైలాగులున్నాయి. రామ్‌లక్ష్మణ్ ఫైట్లు కొత్తగా అనిపిస్తాయి.ఇప్పటిదాకా నా సినిమాల్లో నా వెంట హీరోయిన్లు పడేవారు. ఇందులో నేను హీరోయిన్ వెంట పడతాను. ఒక మాస్ హీరోను ఇలా కూడా చూపించొచ్చా... ఒక కమర్షియల్ సినిమాను ఇలాకూడా తీయొచ్చా..? అనిపించేలా సురేందర్‌రెడ్డి ఈ సినిమాను మలిచాడు. అశోక్ నాటికీ ఇప్పటికీ సురేందర్‌రెడ్డిలో అద్భుతమైన ఛేంజ్ చూశాను. నా కెరీర్‌లో ఊసరవెల్లి ఓ వండర్ '' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X