»   » నా పెళ్లాం బిడ్డలను చూసుకునేంత ఇచ్చారు: రెమ్యూనరేషన్‌పై జూ ఎన్టీఆర్

నా పెళ్లాం బిడ్డలను చూసుకునేంత ఇచ్చారు: రెమ్యూనరేషన్‌పై జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో 'బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు టీవీ రంగంలో ఇంత వరకు ఎవరూ తీసుకోనంత భారీ రెమ్యూనరేషన్ ఈ షోకు ఎన్టీఆర్ తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన 'బిగ్ బాస్' తెలుగు లాంచింగ్ కార్యక్రమంలో రెమ్యూనరేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఎన్టీఆర్ గడుసుగా సమాధానం ఇచ్చారు.

మీరనుకున్నంత కాదు...

మీరనుకున్నంత కాదు...

బిగ్ బాస్ కాన్సెప్టుతో పాటు మీరందుకునే పారితోషికంగా కూడా చాలా హైగా ఉంటుందట కదా అనే ప్రశ్నకు ఎన్టీఆర్ స్పందిస్తూ.... నా పెళ్లాం బిడ్డలను చూసుకునేంత ఉంది, కానీ మీరెంత అనుకుంటున్నారో అంత లేదని మాత్రం చెప్పగలను అంటూ చమత్కరించారు.

డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు

డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు

నేను డబ్బు గురించి, పారితోషికం గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. ఇపుడు మీరు చెబుతుంటే ఆలోచించాల్సి వస్తోంది ఎంతిచ్చారు నాకు అనే లెవల్లో... వాళ్లు బాగానే ఇచ్చారు, కానీ మీరు అనుకుంటున్నంత మాత్రం కాదు అని తారక్ సమాధానం ఇచ్చారు. దీనిపై షో నిర్వాహకులు స్పందిస్తూ అతడి పాషన్, అతడి ఎనర్జీ అన్నీ ఎంతో విలువైనవే, దాన్ని పారితోషికంతో సరిపోల్చలేము అన్నారు.

70 రోజులు నేను ఉండను

70 రోజులు నేను ఉండను

70 రోజులు నేను బిగ్ బాస్ షూటింగులో ఉండను. వీకెండ్ శని, ఆది వారాలు మాత్రమే హోస్ట్ షోలో నేనే కనిపిస్తాను.బిగ్ బాస్ షో షూటింగ్ పూణె లోనావాలో జరుగుతుంది. నా సినిమా షూటింగ్ కూడా ఎప్పడో అక్కడ ప్లాన్ చేశాం... అనుకోకుండా నా సినిమా షూటింగ్, బిగ్ బాస్ షూటింగ్ ఒకే చోట జరుగుతున్నాయి అని తారక్ తెలిపారు.

తారక్ రెమ్యూనరేషన్ గురించి బయట ఇలా..

తారక్ రెమ్యూనరేషన్ గురించి బయట ఇలా..

బిగ్ బాస్ షో కోసం తారక్ రూ. 7 నుండి 8 కోట్లు తీసుకుంటున్నారని కొందరు, అలా కాదు ఎపిసోడ్‌కు 50 లక్షలు తీసుకుంటున్నారని మరికొందరు అంటున్నారు. కాగా తను చేసే సినిమాలకు ఎన్టీఆర్ బయట రూ 10 నుండి 15 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.

English summary
There were several rumours that NTR is charging huge remuneration for hosting the Bigg Boss show. During the Bigg Boss launch event yesterday, NTR responded on the remuneration topic. He said "Thanks to Star Maa for offering me decent amount. But I'am not taking the amount which is widely circulated in the media."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X