జూ ఎన్టీఆర్ సినిమా ‘యాక్షన్’ లేదా ‘బాద్‌షా’?
జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈచిత్రానికి 'యాక్షన్' అనే టైటిల్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ...'బాద్ షా' అనే మరో టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ కథ-స్క్రిప్టు ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఇప్పటి వరకు టైటిల్ ఏమిటి అనేది ఖరారు చేయలేదు.
ఈ సినిమా టైటిల్ విషయమై గోపీ మోహన్ తన మైక్రో బ్లాగింగ్లో స్సందిస్తూ...ఇప్పటి వరకు సినిమా టైటిల్ ఫైనల్ చేయలేదని....'యాక్షన్' టైటిల్ తో పాటు 'బాద్‌షా' అనే మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉందని, త్వరలోనే అధికారకంగా అనౌన్స్ చేస్తామని ప్రకటించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ 'దమ్ము' చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటిస్తున్నారు. జూనియర్ ఇందులో డబల్ రోల్ చేస్తున్నాడని, ఒకటి పోలీసాఫీసర్ పాత్ర, మరొకటి ఫ్యాక్షన్ లీడర్ పాత్ర అని అంటున్నారు. తండ్రి పాత్రలో జూనియర్ ఫ్యాక్షనిస్టుగా, కొడుకు పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











