ఎన్టీఆర్ ని చూస్తేనే కడుపుభ్బా నవ్వు వస్తుంది
మా చిత్రంలో ఎన్టీఆర్ ని చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు అంటున్నారు అదుర్స్ చిత్రం నిర్మాతలు. వి.వి.వినాయిక్ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ చిత్రం డిసెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అవుతోంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాతలు వంశీ మోహన్, కొడాలి నాని మాట్లాడారు. ''షూటింగ్ పూర్తయింది. శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునే సన్నివేశాలుంటాయి. ఎన్టీఆర్ చేసిన రెండు పాత్రలూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. వచ్చేనెల మొదటివారంలో ఆడియో, మూడో వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''ని అన్నారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, తనికెళ్ళ భరణి, మహేష్ మంజ్రేకర్, నాజర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, ముఖుల్‌దేవ్, సుప్రీత్, రమాప్రభ, రాజ్యలక్ష్మి, సుధ, వినయప్రసాద్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కథ-మాటలు: కోన వెంకట్, పాటలు: చంద్రబోస్, కులశేఖర్, రామజోగయ్యశాస్త్రి, ఛాయాగ్రహణం: ఛోటా.కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్.


Click it and Unblock the Notifications











