ఎన్నో హిట్ సినిమాలు నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ ఈ మథ్య కాస్త వెనుకపడ్డా పూరీ 'బుజ్జిగాడు 'తో మళ్ళీ క్రేజ్ సంపాందించుకుంది. దాంతో ఆ సంస్థ అథిపతి కె.యస్.రామారావు రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని మెగా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు. తాజాగా తమ తరువాత సినిమా కోసం ఎన్టిఆర్ ని అడిగారట. అతనూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడుట. డైరక్షన్ కోసం ఇద్దరు యువ దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వినాయక్ సినిమా తరువాత ఈ సినిమా ఉండవచ్చంటున్నారు. వారు చెప్పే కథలని బట్టి ఎవరనేది నిర్ణయమవుతుందిట. దాంతో మరో బ్లాక్ బస్టర్ కి రంగం సిద్దమవుతోందని అభిమానులు సంబరపడుతున్నారు. అలాగే బుజ్జిగాడు 22 న థియోటర్ల లోకి దూకనున్నాడు.
Story first published: Friday, July 17, 2026, 0:55 [IST]