సంక్రాంతికే ఎన్టీఆర్

ఇక ఈ సినిమా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే యోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్వి పాత్రల్లో కనిపించి నవ్వించనున్నారు. కోనవెంకట్ కథ అందించిన ఈ చిత్రం..తన గతం చిత్రం కృష్ణ కన్నా ఎక్కువ నవ్వు లు పూయించే అవకాశముందని వినాయిక్ భావిస్తన్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని కొడాలి నాని, వంశి కలిసి నిర్మిస్తున్నారు.
ఇక వినాయిక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న అదుర్స్ అనంతరం మూడు ప్రాజెక్టులు కమిటయ్యారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి సినిమా నల్లమలుపు బుజ్జి..హరీష్ శంకర్ కాంబినేషన్లో ఎమ్.ఎల్.ఎ చిత్రం. అనంతరం దిల్ రాజు, వంశి పైడిపల్లి దర్శకత్వంలో బృదావనం చిత్రం. ఈ రెండు చిత్రాలకు తలో మూడు నెలలు కాల్షీట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కె.ఎస్.రామారావు నిర్మాతగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం కన్ఫర్మ్ గా జరుగుతాయని సమాచారం.


Click it and Unblock the Notifications











