ఎన్టీఆర్, అల్లు అర్జున్..చెరొక 20 లక్షల విరాళం
హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితులకు సహాయం చేసేందుకు సినీ స్టార్స్ ఒక్కరొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ రూ. 10 లక్షలు, పవన కళ్యాణ్ రూ. 50 లక్షలు విరాళం ప్రకటించగా...తాజాగా స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ కూడా చేరారు. వీరిద్దరూ చోరో రూ.20 లక్షల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విరాళం ప్రకటించారు.
ప్రస్తుతం కేరళలోని కొచ్చిలో ఉన్న అల్లు అర్జున్ హుధూద్ తుఫాన్ సృష్టించిన విళయాన్ని .....మీడియా ద్వారా తెలుసుకుని చలించిపోయారు. సహాయ కార్యక్రమాల కోసం వెంటనే తన వంతు సహాయంగా రూ. 20 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. అభిమానులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

విశాఖ నగరం అంటే నాకెంతో ఇష్టం. హుధూద్ తుఫాను కారణంగా వైజాగ్ రూపురేఖలు మారిపోయిన తీరు చూసి చాలా బాధ పడ్డాను. సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. తాను చేసిన సహాయంలో ఎక్కువ శాతం మత్స్యకారుల కోసం ఉపయోగించాలని కోరుతున్నాను అనికోరారు.
అల్లు అర్జున్ పిలుపు మేరకు ఆయన అభిమానులు కూడా తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కొందరు ఫ్యాన్స్ విశాఖ బయల్దేరి వెళ్లారు. ఎన్టీఆర్ కూడా హుధూద్ తుఫాన్ ఘటనపై విచారం వ్యక్తం చేసారు. సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications











