twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవడు కధ మొదట ఎవరికి చెప్పారో తెలుసా.. ఆ ఇద్దరు అన్నదమ్ములు చేయాల్సిన సినిమా..

    |

    ఇక 2014లో వచ్చిన ఎవడు కథ కూడా చాలామంది హీరోల దగ్గరకు వెళ్లి వచ్చిందట. సినిమాలో అల్లు అర్జున్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ ఫుల్ లెంత్ పాత్రలో నటించి బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా ఓపెనింగ్స్ తోనే సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. అయితే ఆ కథను దర్శకుడు వంశీ పైడిపల్లి నందమూరి అన్నదమ్ముల కోసం అనుకున్నాడట.

    డైరెక్టర్ వంశీ పైడిపల్లి అదృష్టం ఏమిటో గాని అతను చేసిన సినిమాల కథలు ఏవి కూడా అంత ఈజీగా ఫైనల్ అయ్యింది లేదు. ఒక కథపైనే ఏళ్లతరబడి కూర్చొని కమర్షియల్ గా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ను సెట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ మేకింగ్ లో కొన్నిసార్లు తడబడుతుంటారాని కామెంట్స్ అందుకుంటూ వస్తున్నాడు. బృందావనం హిట్టయిన అనంతరం ఎన్టీఆర్ మరో సినిమా చేసేందుకు వంశీ పైడిపల్లికి ఛాన్స్ ఇచ్చాడు. ఎవడు స్టోరీ లైన్ వినగానే తారక్ ఫిదా అయ్యాడు. కళ్యాణ్ రామ్ తో కలిసి ఆ సినిమా చేయాలని అనుకున్నారట. అయితే ఫుల్ స్క్రిప్ట్ పై ఎంతకు కనెక్ట్ కాకపోవడంతో ఆ కథను రామ్ చరణ్ కు చెప్పాడు.

    Ntr and kalyam rejected yevadu story

    దీంతో చరణ్ సింగిల్ సిట్టింగ్ లో ఒకే చెప్పేసి అల్లు అర్జున్ అయితే మెయిన్ పాత్రకు బాగా సెట్టవుతుందని కూడా సజెస్ట్ చేశాడు. కథలో వక్కంతం వంశీ హ్యాండ్ కూడా ఉంది. సినిమాకు అబ్బూరి రవి డైలాగ్స్ కూడా కరెక్ట్ గా సెట్టయ్యాయి. ఇక దిల్ రాజు రంగంలోకి దిగి సినిమాను పట్టాలెక్కించాడు. 35కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బబాక్సాఫీస్ వద్ద 60కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

    English summary
    And the story of yevadu came in 2014 is when so many heroes came and went. It is known that Allu Arjun appeared in an important role in the film. Ram Charan played the role of Full Length and received a box office hit. At that time, the film set a new trend with openings. However, director Vamsi Paidipally thought of the story for Nandamuri Annadammu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X