Oscars Panel: ఆస్కార్ ప్యాన‌ల్‌లో ఆ ఆరుగురు... జక్కన్నను బలిచేశారుగా!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులోని హీరోలు ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నారు. ఆస్కార్ ప్యాన‌ల్‌ లో మెంబ‌ర్స్‌గా చేరే అరుదైన అవ‌కాశాన్ని సొంతం చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....

Ntr and Ram Charan

హాలీవుడ్లో గుర్తింపు...: ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ గా నిలిచి ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కుమురం భీంగా ఎన్టీఆర్ నటించారు. కలెక్షన్స్ తో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఆర్ఆర్ఆర్ టీం అంతా ఒక్కసారిగా ప్రపంచమంతా గుర్తింపు పొందారు. హాలీవుడ్ లో చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా హీరోలు అరుదైన ఘనత సాధించారు.

Ntr and Ram Charan

అరుదైన రికార్డు: ఆస్కార్ సంస్థ అకాడమీలో మెయిన్ కమిటీ కాకుండా దాదాపు 10 వేల మంది సభ్యులు ఉన్నారు. అయితే ఈ ప్యాన‌ల్‌ లో మెంబర్లుగా చేరే అరుదైన అవ‌కాశాన్నిహీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ దక్కించుకున్నారు. అయితే ఈ జాబితాలో ఆస్కార్ విన్న‌ర్స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి, లిరిసిస్ట్ చంద్ర‌బోస్‌ లు ఉన్నారు. వీరితో పాటు మ‌ణిర‌త్నం, క‌ర‌ణ్‌ జోహార్‌ ల‌కు స్టానం ద‌క్కింది. 2023 -24 ఏడాదికిగాను ఆస్కార్స్‌ ప్యానెల్ క‌మిటీ మెంబ‌ర్స్‌ గా 398 మందికి అకాడెమీ ప్ర‌తినిధులు ఆహ్వానాలు పంపారు.

Ntr and Ram Charan

తొలి హీరోలు వీళ్లే...:ఇన్విటేష‌న్స్ అందిన వారి జాబితాలో టాలీవుడ్ నుంచి స్టార్ హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ స్థానం దక్కించుకోగా.... ఆస్కార్స్ నుంచి ఆహ్వానాన్ని అందుకున్న తొలి తెలుగు హీరోలుగా వీళ్లు అరుదైన రికార్డ్ నెల‌కొల్పారు. వీరితో పాటు ఆస్కార్ విన్న‌ర్స్‌, ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి, లిరిసిస్ట్ చంద్ర‌బోస్ లకు సైతం ఆహ్వానాలు అందాయి. ఆస్కార్ ప్యాన‌ల్ నుంచి ఇన్విటేష‌న్స్ అందిన వారి జాబితాలో సినిమాటోగ్రాఫ‌ర్‌ సెంథిల్‌కుమార్‌తో పాటు మ‌ణిర‌త్నం,క‌ర‌ణ్ జోహార్‌, సిద్దార్థ రాయ్ క‌పూర్‌, షౌన‌క్ సేన్‌, చైత‌న్య త‌మ్హ‌నేతో పాటు మ‌రికొంద‌రు ఇండియ‌న్ సినీ ప్ర‌ముఖులు ఉన్నారు. ఈ స‌భ్యుల జాబితా వివ‌రాల్ని ఆస్కార్స్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Ntr and Ram Charan

జక్కన్నకు హ్యాండ్: దీంతో అభిమానులు, నెటిజన్లు ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ లిస్ట్ లో రాజమౌళి లేకపోవడం అందర్నీ నిరాశ పరిచింది. వీరందరికి ఆస్కార్ సంస్థ ఇన్విటేషన్స్ పంపించింది. వీరంతా వాటిని యాక్సెప్ట్ చేస్తేనే వీరు అకాడమీ మెంబెర్స్ గా గుర్తించబడతారు. వీరు వచ్చే ఆస్కార్ అవార్డ్స్ లో బరిలో నిలిచిన సినిమాలకు ఓట్లు వేయొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X