మహేష్ ముగించాడు.. ఇక ఎన్టీఆర్ వంతు, ఇండిపెండన్స్ డే రోజు!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ నేడు విడులయ్యాయి. పైగా నేడు సూపర్ స్టార్ బర్త్ డే కావడంతో ఫాన్స్ ఆ హ్యాంగ్ ఓవర్ లోనే పండగ చేసుకుంటున్నారు. మహర్షి చిత్రంలో మహేష్ లుక్ అదిరిపోయేలా ఉంది. మహేష్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులని ఖుషి చేసే పనిలో పడ్డాడు. అరవింద సమేత చిత్ర టీజర్ విడుదలకు ముహూర్తం కుదిరింది.

ఆగష్టు 15న
ఆగష్టు 15 న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అరవింద సమేత టీజర్ విడుదల చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. టీజర్ విడుదుల సమయాన్ని త్వరలో ప్రకటించనున్నారు.

ఫస్ట్ లుక్ తోనే
అరవింద సమేత చిత్రంపై ఫస్ట్ లుక్ తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న తొలి చిత్రం కాబట్టి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టీజర్ అదిరిపోయేలా ఉంటే అభిమానుల ఉత్కంఠ దాదాపుగా తొలగిపోయినట్లే అని భావించవచ్చు.

ఫ్యాక్షన్ నేపథ్యంలో
అరవింద సమేత చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల లీకైన కొన్ని స్టిల్స్ సినిమాపై ఇంకాస్త అంచనాలు పెంచాయి. నాగబాబు, ఎన్టీఆర్ ఎమోషనల్ సన్నివేశానికి సంబందించిన స్టిల్ లీకైంది.

పూజ హెగ్డేతో రొమాన్స్
పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇషా రెబ్బా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ప్రధాన ఆకర్షణగా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దసరా కానుకగా చిత్రం విడుదుల కానుంది.


Click it and Unblock the Notifications











