ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా ‘ఈ మాయ పేరేమిటో’ ఆడియో వేడుక
సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'. కావ్యా థాపర్ హీరోయిన్. వి.ఎస్ క్రియేటివ్ వర్క్స్ బేనర్‌పై రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరడానికి వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే వరుణ్ తేజ్ ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయించగా, సాయి ధరమ్ తేజ్ ద్వారా హీరో హీరోయిన్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక జులై 28న ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా ఇన్వైట్ చేశారు.

దర్శకుడు రాము కొప్పుల మాట్లాడుతూ - మంచి లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ మూవీ తెరకెక్కుతోంది. చిత్రీకరణంతా పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరిగుతున్నాయి. రాహుల్ విజయ్ సూపర్బ్ పెర్ఫామర్. దివ్య విజయ్ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మణిశర్మ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిట్ వర్క్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుంది అన్నారు.
రాహుల్ విజయ్, కావ్యా థాపర్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, రాళ్లపల్లి, ఈశ్వరీరావు, పవిత్రా లోకేశ్, సత్యం రాజేశ్, జోశ్ రవి, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: విజయ్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: చిన్నా, సాహిత్యం: శ్రీమణి, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శామ్ కె.నాయుడు, నిర్మాత: దివ్యా విజయ్, దర్శకత్వం: రాము కొప్పుల.


Click it and Unblock the Notifications











