ఆ విషయంలో మహేష్ బాబు కి గట్టి పోటి ఇస్తున్న జూ ఎన్టీఆర్
స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ ఇప్పటికే 'నవరతన్ టాల్కం పౌడర్",'జండూబాం"లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా జూ.ఎన్టీఆర్ 'మలబార్ గోల్డ్" అనే బంగారు ఆభరణాల సంస్థకు బ్రాండ్ అంబాసడర్‌గా నియమితులయ్యారు. దాంతో జూ.ఎన్టీఆర్..బ్రాండ్ అంబాసిడర్ లకు అంబాసిడర్ గా మారిన మహేష్ కు పోటి ఇచ్చినట్లు అయింది.సినిమాలు సంగతి ఎలా ఉన్నా ఈ ప్రకటనల విషయంపై దృష్టి ఎక్కువ పెడుతున్న మహేష్ రూటులోనే ఎన్టీఆర్ ప్రయాణం పెట్టుకున్నారు.
ఇక మలబార్ గోల్డ్ సంస్థకు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా డ్రీమ్ గర్ల్ హేమమాలినితో కలిసి మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరి స్థానంలో ఎన్టీఆర్ 'మలబార్ గోల్డ్"కు బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరించనున్నారు.కాగా నాగార్జున అక్కినేని 'కళ్యాణ్ జ్యుయలర్స్"కు, వెంకటేష్ 'మణప్పురం గోల్డ్"కు బ్రాండ్ అంబాసడర్స్‌గా వ్యవహరిస్తుండడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











