మేమంతా నీతో ఉన్నాం.. అరవింద సమేత లొకేషన్‌లో ఎన్టీఆర్!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ లో ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. ఒక్కసారిగా టీజర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు షాక్ లో ఉన్నారు.

విషాదంలో
తండ్రి మరణంతో ఎన్టీఆర్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇటీవలే హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మరుసటి రోజు నుంచే ఎన్టీఆర్ అరవింద సమేత చిత్ర షూటింగ్ కు హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

అనుకున్న సమయానికి
చిత్రాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి, నిర్మాతకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంతటి విషాదంలో కూడా ఎన్టీఆర్ షూటింగ్ ల పాల్గొంటున్నాడు. అరవింద సమేత చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మేమెంతా
తాజగా అరవింద సమేత షూటింగ్ లొకేషన్ లో ఎన్టీఆర్ ఉన్న ఫోటోని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఎన్టీఆర్ డెడికేషన్ కు ఇది నిదర్శనం అంతో ప్రశంసలు కురిపించాడు. ఆయన డెడికేషన్ చూస్తుంటే గౌరవం ఇంకా పెరిగిందని తమన్ తెలిపాడు. మేమంతా నీతో ఉన్నాం. మీకు మరింత బలం చేకూరాలి అని ట్వీట్ చేశాడు.

రాయలసీమ ఫ్యాక్షన్
అరవింద సమేత చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ తండ్రిగా ఈ చిత్రంలో నాగబాబు నటిస్తున్నారు. పూజగా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











