»   » షాయాజీ షిండే ని ఎన్టీఆర్ వీరకొట్టుడు

షాయాజీ షిండే ని ఎన్టీఆర్ వీరకొట్టుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యమా జోరు మీదున్న ఎన్టీఆర్‌ని షాయాజీ షిండే అడ్డుకోవాలని చూసారు. అందుకే ఎన్టీఆర్‌ వీరకొట్టుడు కొట్టాడు. ఎందుకు అనేది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తుంది అంటున్నారు దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. సమంత హీరోయిన్. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మిస్తున్న చిత్రమిది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఎన్టీఆర్‌, ఇతర ముఖ్య తారాగణంపై పోరాట, కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు.

నిర్మాత మాట్లాడుతూ...''ఎన్టీఆర్‌ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని రకాల అంశాల్ని ఇందులో జోడిస్తున్నాం. ఎన్టీఆర్‌, సమంతల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి'' అన్నారు. ఈ చిత్రానికి మొదట రభస అనే టైటిల్ ని అనుకున్నారు. ఈ టైటిల్ ని ఎన్టీఆర్ మార్చమన్నట్లు సమాచారం. ఈ మేరకు 'జోరు' అనే టైటిల్ ని పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈచిత్రాన్ని బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు అని చెప్తున్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.

సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో కథానాయకుడు ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు.


ఇక... ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.


ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
NTR is busy with the shooting schedules of Rabhasa in the direction of Santhosh Srinivas which is currently being shot in Ramoji Film City, Hyderabad. Rabhasa will be an out and out commercial entertainer with ample comedy. Kandireega fame Santhosh Srinivas is directing the film and Bellamkonda Suresh is producing it on Sri Sai Ganesh Productions banner. Samantha playing the female lead , and a song on the leads composed by Thaman will be canned after the action sequences shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu