వరసగా నందమూరి సినిమాలే హిట్టు..జూ..ఎన్టీఆర్
ఎన్టీఆర్ మాట్లాడుతూ "ఈ ఏడాది 'అదుర్స్', 'సింహా', 'బృందావనం', ఇప్పుడు 'కల్యాణ్‌రామ్ కత్తి' తప్పకుండా హిట్ కొడుతున్నాం. నేను చెబుతున్నాను. రాసుకోండి అంటూ తమ నందమూరి సినిమాలే వరసగా విజయం సాధిస్తున్నాయని అన్యాపదేశంగా చెప్పారు. యన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తూ నిర్మిస్తున్న చిత్రం 'కత్తి'. మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సనాఖాన్ నాయిక. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే..దర్సకుడు మల్లి ఈ చిత్రంతో విజయపీఠాన్ని అధిష్టించాలని కోరుతున్నాను" అని అన్నారు.
ఇక హరికృష్ణ మాట్లాడుతూ...ఈ ఏడాది నా తమ్ముడి సింహా, నా బిడ్డ ఎన్టీఆర్ నటించిన అదుర్స్, బృందావనం విజయాల వరుసలోనే నా మరో బిడ్డ కళ్యాణ్ నటించిన ఈ కత్తి కూడా ఉండాలని ఆశిస్తున్నాను.చిత్ర పరిశ్రమలో నిర్మాత తల్లి లాంటివాడైతే దర్శకుడు తండ్రి లాంటివాడు. వారిద్దరి అనుబంధం కరెక్ట్‌గా ఉంటే మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. వరద బాధితులైన రైతులకు సహాయార్థంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ తరఫున పార్టీ ఫండ్‌గా మూడు లక్షలు విరాళాన్ని అందజేసిన కళ్యాణ్ రామ్ కు నా అభినందనలు అందిస్తున్నాను అని హరికృష్ణ అన్నారు.


Click it and Unblock the Notifications











