For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాద్ షా’ షాట్ లీక్... జూ ఎన్టీఆర్ న్యూలుక్ హల్ చల్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, కాజల్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ 'బాద్ షా'. చిత్రంలో జూ ఎన్టీఆర్ గత సినిమాలకు భిన్నంగా కొత్తలుక్‌తో కనిపించనున్నారు. ఇటీవల ఓ ప్రెస్ మీట్లో జూ ఎన్టీఆర్ సరికొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించిన విషయం తెలిసిందే. జూనియర్ కర్లింగ్ హెయిర్ కాస్త సాఫ్ట్ హెయిర్‌లా తయారైంది. అదంతా కూడా అతను నటిస్తున్న 'బాద్ షా' చిత్రం షూటింగులో భాగంగా చేసిన మేకప్ స్టైల్. జూ ఎన్టీఆర్ ఈ చిత్రంలో 7 సరికొత్త హెయిర్ స్టైల్స్‌లో కనిపించనున్నాడు.

    తాజాగా బాద్ షా చిత్రానికి సంబంధించిన జూ ఎన్టీఆర్ న్యూలుక్ స్టిల్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి విడుదలయ్యాయి. ఫోటోలో కనిపిస్తున్నది 'బాద్ షా' చిత్రంలోని స్టిల్లే. కొన్ని పాటల్లో...కొన్నీ సీన్లలో జూనియర్ ఈ ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్‌లో దర్శనం ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం ముంబై నుంచి ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్టులను తెప్పించారు. ఈ సినిమాలో జూనియర్ లుక్ అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని తేవడం ఖాయం అంటున్నారు.

    మరో వైపు ఈచిత్రానికి సంబంధించి జూ ఎన్టీఆర్ పై విదేశాల్లో చిత్రీకరించిన డాన్స్ వీడియో షాట్ ఒకటి లీక్ అయింది. యూ ట్యూబ్‌లో ఇది హల్చల్ చేస్తోంది. అందులో ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేస్తుండటంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగి పోయాయి.

    శ్రీను వైట్ల దర్వకత్వంలో రూపొందుతున్న 'బాద్ షా' చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. జూనియర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ హీరో నవదీప్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి గోపీమోహన్, కోన వెంకట్ అద్భుతమైన స్క్రిప్టు అందించారు. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి సందర్బంగా జనవరి 11, 2013న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    English summary
    The first look poster of young tiger Ntr's 'Baadshah' has been released by the production house today. The actor sports a stylish look in the film, which shows him in a light that he has never been seen before. He has lost his trademark curls, and came up with a layered bang for this film. A Mumbai stylist has been roped in to oversee the actor's styling.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X