twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ‘బాద్ షా’ లోగో ఫస్ట్ లుక్ ఇదే

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. ఈ చిత్రం లోగో ఫస్ట్ లుక్ విడుదలైంది. ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకునేలా ఈ లోగో డిజైన్ చేసారకు. లోగోలోనే ఓ పవర్ ఫుల్ నెస్ ని కనపడేలా శ్రీనువైట్ల ప్రత్యేకంగా దీన్ని దగ్గరుండి డిజైన్ చేయించారు. టైటిల్ ఎడ్జ్ లు మెరుస్తూ... హైలెట్ అవుతోంది... ఎన్టీఆర్ ఈ సినిమాతో అన్ని రకాలగా షైన్ అవుతారనే విషయం గుర్తు చేస్తున్నట్లుగా ఉంది.

    ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాద్‌షా'. కాజల్‌ కథానాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ నెల 16 నుంచి చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలవుతుంది. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ''ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలనుకొంటారో అదే తరహాలో ఉండబోతోంది 'బాద్‌షా'. ఇందులో నా వేషధారణ, హావభావాల దగ్గర్నుంచి ప్రతి విషయంపైనా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొంటున్నారు దర్శకుడు. నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుంది'' అన్నారు.

    ''ఎన్టీఆర్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా చిత్రాన్ని తీర్చిదిద్దాం. వినోదం, భావోద్వేగాలు, యాక్షన్‌... ఇలా అన్ని అంశాలూ సమపాళ్లలో కుదిరాయి. ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించబోతున్నాం. వేసవికి వస్తున్న ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకీ వినోదం పంచుతుంద''న్నారు దర్శకుడు. ''కథాబలమున్న చిత్రమిది. 'బాద్‌షా డిసైడైతే.. వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది...' అంటూ విడుదల చేసిన తొలి ప్రకటన చిత్రానికి విపరీతమైన స్పందన లభించింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు. మార్చి 10న పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు నిర్మాత.

    జూ ఎన్టీఆర్- కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో 'బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

    English summary
    NTR’s comedy-action entertainer “Baadshah” is progressing in brisk space. Latest news is that title logo has been unveiled just a while ago. Kajal Agarwal is casted opposite NTR, while Srinu Vytla and Producer Bandla Ganesh are very confident about the film. Here is the first look of Baadshah Logo...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X