నాగార్జున సాగర్ వద్ద ఎన్టీఆర్, నవదీప్ మధ్య గొడవ!
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'బాద్ షా' చిత్రంలో నవదీప్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం షూటింగ్ రేపటి నుంచి నాగార్జున సాగర్ వద్ద ప్లాన్ చేసారు. ఇక్కడ జూ ఎన్టీఆర్-నవదీప్ మధ్య ఫైట్ సీన్స్ ప్లాన్ చేసారు. నాగార్జున సాగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా మరికొన్ని సీన్లు చిత్రీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసారు.
శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాద్ షా సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యులు నాగార్జున సాగర్‌కు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత రేపటి నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని, ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మార్చిలో ఆడియో విడుదల చేసి ఏప్రిల్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











