ఎన్టీఆర్ ఇమేజ్..నా స్టైల్... బాక్సాఫీస్ షేక్!
హైదరాబాద్: అదుర్స్, బృందావనం, ఊరసవెల్లి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, దూకుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీను వైట్ల, గబ్బర్ సింగ్ లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత బండ్ల గణేష్..ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తోన్న సినిమా 'బాద్ షా'. శివ బాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్ పై నిర్మాణం జరుపుకుంటున్న ఈచిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కాబోతోంది.
ఈ సందర్బంగా దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ...'ఎన్టీఆర్ ఇమేజ్ కి తగినట్లుగా ఉంటూనే నా సినిమాల స్టైల్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో ఈచిత్రం ఉంటుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ చాలా డిఫరెంటుగా ఉంటుంది. ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ చేస్తున్నందుకు చాలా హ్యపీగా ఉంది. ఎన్టీఆర్ తో పాటు నా కెరీర్‌కి ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది' అన్నారు.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'తెలుగు ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కాబోతోంది. ఎన్టీఆర్, కాజల్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ రంగాలకు చెందిన 50 మందికిపైగా ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 5 వరకు బ్యాంకాక్ లో షూటింగు జరుపుకుని 12 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్ జరుగుతుంది. దీని తర్వాత గుజరాత్, యూరఫ్, హాంకాంగ్ లలో నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుని జనవరి 11న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా 'బాద్ షా' చిత్రాన్ని విడుదల చేయడానికి పక్కాగా ప్లాన్ చేస్తున్నాం. ఈ సంక్రాంతికి 'బాద్ షా' ప్రేక్షకుల్ని, అభిమానులను హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్ టైన్ చేయడానికి వస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ గానీ, ఎమోషన్ గానీ, రొమాన్స్ గానీ, ఎంటర్ టైన్మెంట్ గానీ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటాయి. ఈ చిత్రంలో బాద్ షాగా ఓ కొత్త ఎన్టీఆర్ ను చూస్తారు.' అన్నారు.
ఈ చిత్రానికి థమన్, గోపీ మోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల


Click it and Unblock the Notifications











