ఎన్టీఆర్ ఫ్యాన్ పడిగాపులే: ‘బాద్ షా’ ఎండా కాలమే!
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈచిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఎండా కాలం వరకు ఈ సినిమాను రిలీజ్ చేయబోమని నిర్మాత బండ్ల గణేష్ సంకేతాలు ఇచ్చారు. దీంతో అభిమానులు ఎన్టీఆర్ సినిమా కోసం పడిగాపులు పడక తప్పని పరిస్థితి.
సంక్రాంతికి సినిమాల పోటీ ఎక్కువగా ఉండటంతో ముందే రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ....వీలు కాక పోవడంతో సంక్రాంతి తర్వాతకు వాయిదా వేసారు. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్థులకు పరీక్షా కాలం కాబట్టి...అవి పూర్తయ్యాక అంటే సమ్మర్ హాలిడేస్(మార్చి చివరి వారం) లోనే ఈచిత్రం విడుదల కానుంది.
దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని, ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
డిసెంబర్ నెలలో లేదా జనరి నెలలో ఆడియో విడుదల చేసే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యేలా ఉంది కాబట్టి సంక్రాంతి దాటిన తర్వాత ఆడియో విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











