జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’ షూటింగ్ ఫ్రాన్స్‌లో...
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'బాద్ షా' ఇటలీ, ఆపై స్విట్జర్లాండ్‌లలో షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం....తాజాగా ఫ్రాన్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడి బ్యూటిఫుల్ లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్రాన్స్‌లో ఈపిల్ టవర్ లాంటి అద్భుత కట్టడంతో పాటు పలు అందమైన లొకేషన్లు ఉన్నాయి.
జూ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. దమ్ము చిత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వక పోవడంతో ఈ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు జూనియర్. శ్రీను వైట్ల అండ్ టీం 'బాద్ షా' చిత్రం కోసం సమకూర్చిన స్కిప్టు ఎన్టీఆర్‌కి బాగా నచ్చడంతో సినిమా ఈ సారి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఉన్నాడట. ఆ సంతోషంలోనే ఇటీవల దర్శకుడు శ్రీను వైట్లకి రూ. 2 లక్షల విలువ చేసే ఖరీదైన వాచ్ ఇచ్చాడు.
శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. డిసెంబర్ కల్లా షూటింగ్ పార్టు పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. అదే నెలలో ఆడియో విడుదల కానుంది.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











