ఎన్టీఆర్ తో చేసే చిత్రం వివరాలు వెల్లడి చేసిన బెల్లంకొండ సురేష్
హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఓ చిత్రం రూపొందనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ బెల్లంకొండ సురేష్ ..చిత్రం ప్రకటన చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ విషయం ఖరారు చేసారు. అలాగే ఎన్టీఆర్ సరసన సమంత నటించనుందంటూ తెలియపరిచారు. దాంతో ఎన్టీఆర్ మరోసారి సమంతకు తన సరసన అవకాసమిచ్చినట్లు అయింది. అలాగే ఇప్పటికే బెల్లంకొండ సురేష్ భ్యానర్ లో సమంత హీరోయిన్ గా చేస్తోంది.
ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ..."ఎన్టీఆర్ కి ఫరఫెక్ట్ గా సూట్ అయ్యే అధ్బుతమైన సబ్జెక్టు సంతోష్ శ్రీనివాస్ రెడీ చేసారు. కథ వినగానే ఎన్టీఆర్ ఎంతో ఇన్స్పైర్ అయ్యి మార్చి నుంచి ఈ సినిమా చేస్తానని చెప్పారు. ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటించే ఈ చిత్రంకు సంభందించిన మిగతా వివరాలను త్వరలోనే తెలియచేస్తాము" అన్నారు.
రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ నిర్మించిన 'కందిరీగ' చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'కందిరీగ-2' చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు కూడా. అయితే 'కందిరీగ-2'కి ఆదిలోనే హంసపాదులా.. మొదట్లోనే రకరకాల సమస్యలు వచ్చాయి. దర్శకుడు, నిర్మాతల విభేధాలతో ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇన్నాళ్ళ తర్వాత ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతోంది.
ఎన్టీఆర్ సరసన సమంత చేసే ఈ చిత్రానికి సమర్పణ బెల్లంకొండ సురేష్, నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు, కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం సంతోష్ శ్రీనివాస్... శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తారు.


Click it and Unblock the Notifications











