For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంకోటి లీకైంది: బైక్ పై 'టెంపర్‌' చూపిస్తూ...(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్: నిన్నటి నుంచీ టెంపర్ హీట్ మొదలయ్యింది. ఎక్కడ విన్నా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ గురించి ఫస్ట్ లుక్ గురించే చర్చ. ఈ నేపధ్యంలో మరో పిక్చర్ లీకైంది. రాయల్ ఎనఫీల్డ్ బైక్ పై బేర్ బాడీతో కూర్చుని ఉన్న ఎన్టీఆర్ ఫొటో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి మరి.

  ఎన్టీఆర్‌, కాజల్‌ జంటగా 'టెంపర్‌' చిత్రంలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఇటీవల గోవాలో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రచార చిత్రాల్ని విడుదల విషయమై పూరి జగన్నాథ్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో రాసుకొచ్చారు. పూరీ ట్వీట్ చేస్తూ... " ఈ రోజు సాయింత్రం నాలుగు గంటలకు టెంపర్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేస్తున్నాం !స్టే ట్యూన్డ్! " అన్నారు. అంటే సాయింత్రం పండగ అన్నమాట.

  NTR Bike Pose in Temper Movie

  ఇక బుధవారం ముందస్తుగా ఎన్టీఆర్‌ ప్రచార చిత్రాలు కొన్ని బయటికొచ్చాయి. అవి అంతర్జాలంలో సందడి సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్‌ పోలీసు పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకూ గోవాలో యాక్షన్‌ ఘట్టాలతో పాటు కొన్ని సరదా సన్నివేశాల్ని తెరకెక్కించారు. జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

  మరో ప్రక్క...కొంతకాలం దర్శకుడు,హీరో మధ్య ఇగో క్లాషెష్, కొంతకాలం భారీ వర్షాలు, మరికొంతకాలం స్ట్రైక్ ఇలా రకరకాల కారణాలు..పూరీ, ఎన్టీఆర్ సినిమాను ఆలస్యం చేస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆ లేటు వెళ్లి ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పూరీ. అందులో భాగంగా లైవ్ ఎడిటింగ్ ని చేయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందునిమిత్తం గోవా షూటింగ్ స్పాట్ కు ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ వెళ్లారు. గతంలో ఎస్.ఆర్.శేఖర్.. పూరి చిత్రం ఇద్దరమ్మాయిలతో ట్రైలర్ కట్ చేసారు. ఆ ట్రైలర్ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే.

  షూటింగ్ అయిన దాన్ని ఎప్పటికప్పుడు ఎడిట్ చేసేస్తూంటారు. దాని మూలంగా బాగా రాని షాట్స్, మర్చిపోయిన షార్ట్ ఎప్పటికప్పుడు తెలిసిపోయి... ప్యాచ్ వర్క్ వంటివి నివారించవచ్చు. అలాగే ఎడిటింగ్ అయ్యే సమయం కలిసివస్తుంది. ప్రస్తుతం రఫ్ ఎడిటింగ్ చేసుకుని చివర్లో కాస్త టైమ్ తీసుకుని ఫైనల్ ఎడిటింగ్ చేసేస్తారు.

  ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్లభరణి, ఆలీ. పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిశోర్‌, జయ ప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, పవిత్ర వంటి స్టార్‌ కాస్టింగ్‌ అంతా నటించడం కూడా ఈ సినిమాకి మంచి హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు

  English summary
  Here is a new leaked picture from Temper, where NTR is seen flaunting his shapely physique. This is best makeover till date for Jr NTR who is sitting on Royal Enfield bike.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X