ఆసక్తి రేపుతున్న ఎన్టీఆర్ బయోపిక్: హరికృష్ణ గా కళ్యాణ్ రామ్, జగపతి"బాబు" కూడా...

Recommended Video

చంద్రబాబు క్యారెక్టర్ లో ఈ హీరో నా ?

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానున్న విషయం తెలిసిందే. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన దర్సకుదు తేజా ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉంటూనే ఇప్పటినుంచే కావాల్సినంత హైప్ ని తెచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే అసలు తేజా గతం లో ఎప్పుడూ చేయని స్టైల్లో పబ్లిసిటీ ఫీలర్లు వదులుతూ వస్తున్నాడు.

 పోలిటికల్ విమర్శలకు తావు లేకుండా

పోలిటికల్ విమర్శలకు తావు లేకుండా

ఒకపక్క "లక్ష్మీ'స్ ఎన్టీఆర్" అని రామ్‌గోపాల్ వర్మ, దానికి పోటీగా "లక్ష్మీ'స్ వీరగ్రంథం" అనే పేరుతో మరో సినిమా మొదలయ్యి కావాల్సినంత గందర గోళాన్ని క్రియేట్ చేస్తూంటే పోలిటికల్ విమర్శలకు తావు లేకుండా సైలెంట్‌గా తన పని తాను చేసుకు పోతున్నాడు తేజా. అసలు ఇలాంటి సినిమాకి తేజా లాంటి దర్శకుడు పని చేస్తున్నాడు అనే విషయమే కాస్త ఆశ్చర్యం అనుకుంటే ఇక తేజా నటుల సెలక్షన్ మరింత ఆశ్చర్య కరంగా ఉంది..

 నందమూరి తారకరామారావు బయోపిక్‌

నందమూరి తారకరామారావు బయోపిక్‌

తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారకరామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌' గురించి తాజాగా ఆసక్తికరమైన అంశం బయటికొచ్చింది. ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. మరి హరికృష్ణ పాత్రలో ఎవరు నటిస్తారా? అనే ఆసక్తి గత కొన్నాళ్లుగా సినీ ప్రియుల్లో ఉంది.

నందమూరి హరికృష్ణగా కల్యాణ్‌రామ్‌

నందమూరి హరికృష్ణగా కల్యాణ్‌రామ్‌

ఇప్పుడు అందుకు సమాధానం దొరికింది. తేజ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో తాజాగా నందమూరి కల్యాణ్‌రామ్‌ పేరు చేరింది. నందమూరి హరికృష్ణ పాత్రను ఆయన తనయుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ తెరమీద పోషించనున్నట్టు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ఇక మరింత ఆసక్తిగా వినిపిస్తోన్న ఇంకోవిషయం చంద్రబాబు నాయుడు పాత్రలో జగపతి బాబు నటించనున్నాడట.

 ఆ పాత్రకోసం జగపతి బాబు

ఆ పాత్రకోసం జగపతి బాబు

ఇదైతే ఖచ్చితంగా సెన్సేషన్ విషయమే. ఈ మధ్యకాలం లో ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి అసలు విలన్ బాబు గారే అంటూ వచ్చే ప్రచారం నేపథ్యం లోనే రామ్‌గోపాల్ వర్మ తన కథ రాసుకున్నారు అని వస్తున్న వార్తల నేపథ్యం లో ఆ పాత్రకోసం జగపతి బాబు ని తేజా ఎన్నుకోవటం తో అసలు ఈ చంద్రబాబు ని ఎంత పాజిటివ్ గా చూపించాలనుకుంటున్నాడో అర్థమయ్యింది అంటూ ఇప్పటికే కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.

 ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌

ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది. నందమూరి బాలకృష్ణతో కలిసి సాయి కొర్రపాటి, విష్ణు ఇందుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మొత్తానికి తెలుగుసినిమా మహానటుడు ఇన్నాళ్ళకి ఈ రకంగా సినిమా వస్తువైపోయి తెలుగు ప్రేక్షకులకి రకరకాలుగా కనిపించనున్నాడన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X