‘ఎన్టీఆర్ బయోపిక్’ మూవీ లాచింగ్ ఈవెంట్ (లైవ్)
తెలుగుజాతి ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకెళ్లిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించనున్నారు.
తేజా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం నాచారంలోని రామకృష్ణ స్టూడియోలో జరిగింది. ఉదయం 9.42 నిమిషాలకు ప్రారంభోత్సవ ముహూర్తం నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వెంకయ్యతో పాటు ఏపీ, తెలంగాణ మంత్రులు, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు దర్శకులు, ప్రముఖ నటులు హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో బాలయ్య దుర్యోధనుడి గెటప్ లో కనిపించారు.


Click it and Unblock the Notifications











