ఎన్టీఆర్ జన్మస్థలంలో.. బాలయ్య డిసైడ్ చేశాడు!

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. బాలయ్య స్వయంగా ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ జీవితం సినీరాజకీయ అంశాలతో ముడిపడి ఉంది. దీనితో సినీరంగానికి సంబందించిన అంశాలని ఎన్టీఆర్ కథానాయకుడుగా, రాజకీయ అంశాలని ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండు భాగాలలో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం జనవరి 9న విడుదల కానున్న నేపథ్యంలో భారీ ప్రచార కార్యక్రమాలని చిత్ర యూనిట్ నిర్వహించనుంది.

ట్రైలర్ విడుదల తేదీ

ట్రైలర్ విడుదల తేదీ

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య అదరగొడుతున్నాడు. ట్రైలర్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 16న ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య చెప్పే డైలాగులు ఎలా ఉంటాయి, హావభావాలు ఎలా ఉంటాయి.. మొత్తంగా ఈ చిత్రంలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రకు తగ్గట్లుగా నటించాడా అనే అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఎన్టీఆర్ జన్మస్థలంలో

ఎన్టీఆర్ జన్మస్థలంలో

ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అంశం ఆడియో విడుదల వేడుక. దిగ్గజ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి స్వరాలూ సమకూరుస్తున్నారు. ఆడియో వేడుకని అంగరంగ వైభవవంగా నిర్వహించెబుతున్నట్లు తెలుస్తోంది. ఆడియో విడుదల తేదీ, వేదికని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరులో ఈ చిత్ర పాటల వేడుక నిర్వహించాలని బాలయ్య డిసైడ్ అయ్యాడు. డిసెంబర్ 21న ఈ ఈవెంట్ జరగబోతున్నట్లు తెలుస్తోంది.

ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్

ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్

బాలకృష్ణ ఈ చిత్ర నిర్మాణంలో స్వయంగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. తన తండ్రి చరిత్ర కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య 60కి పైగా గెటప్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ప్రతి ప్రేము అద్భుతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కీలక పాత్రల్లో

కీలక పాత్రల్లో

ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా విద్యా బాలన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో రానా, తన తండ్రి హరికృష్ణ పాత్రలోకల్యాణ్‌రామ్, ఏఎన్నార్ పాత్రలో సుమంత్‌, జయప్రదగా హన్సిక, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సావిత్రిగా నిత్యా మీనన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన రాజకీయ సంఘటనలని ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొని ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X