twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందమూరి అందగాడు చిందులేయగా.. బాలయ్య వేటగాడు లుక్ కేక!

    |

    దివంగత మహానటుడు ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌‌కు సంబంధించి రోజుకొక న్యూ లుక్ అభిమానులను మంత్రముగ్దులను చేస్తోంది. నటుడిగా, రాజకీయ నాయకుడిగా వివిధ సందర్భాల్లో ఎన్టీఆర్ ఎలా ఉండే వారో.... అందుకు ఏమాత్రం తగ్గకుండా నటీనటులను మేకోవర్ చేస్తూ దర్శకుడు క్రిష్ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు.

    తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో లుక్ విడుదలైంది. వేటగాడు సినిమా సమయంలో ఎన్టీఆర్ లుక్‌ను ప్రతిబింభిస్తూ బాలయ్య సర్‌ప్రైజ్ చేశారు. ఈ ఫోటో చూస్తుంటే అలనాడు అన్నగారిని చూసినట్లే ఉందని అంటున్నారు అభిమానులు. ఈ బయోపిక్‌లో ఎన్టీ రామారావు పాత్రను ఆయన కుమారుడైన బాలయ్య పోషిస్తున్న సంగతి తెలిసిందే.

    నందమూరి అందగాడు చిందులేయగా..

    ‘‘నందమూరి అందగాడు చిందులేయగా... తెలుగువాడి నరనరమూ నాట్యమాడగా.. మీ వేటగాడు'' అని పేర్కొంటూ ‘ఎన్టీఆర్ బయోపిక్' చిత్ర బృందం ఈ కొత్త లుక్ విడుదల చేశారు.

    భాగం రెండు భాగాలుగా

    ఈ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం ‘కథా నాయుడు' పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సినీ జీవితం గురించి చూపించబోతున్నారు. ఇందులో వచ్చే వేటగాడు పోర్షన్లో హీరోయిన్ శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతున్నారు. ఇందులో ‘ఆకు చాటు పిందె తడిసె' పాటను సైతం రీమిక్స్ చేశారు.

    ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య వ్యక్తులు

    ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య వ్యక్తులందరూ కనిపించబోతున్నారు. రామారావు భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ కనిపించబోతున్నారు. తన కుమారుడు, రాజకీయ చైతన్య రథసారథి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు.

    మహానాయకుడు పేరుతో రెండో భాగం

    ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహాయకుడు' పేరుతో తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ రాజకీయాల వైపు రావడం, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం లాంటివి చూపించబోతున్నారు. రెండు భాగాల్లొ మొదటి భాగం రాబోయే జనవరి 9, రెండో భాగం జనవరి 24న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    NTR Biopic Balakrishna's Vetagadu Look released. The movie produced by Nandamuri Balakrishna, Sai Korrapati Ranganatha and Vishnu Induri under NBK Films, Vaaraahi Chalana Chitram, and Vibri Media banners and directed by Krish. It is the first movie in the two part biographical movie series based on the life of former movie star and politician N. T. Rama Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X