twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్ బిజినెస్: చిరంజీవిపై బాలయ్య పైచేయి.. రిలీజ్‌కు ముందే కోట్ల వర్షం!

    |

    తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా సంబంధించి మొదటి భాగానికి ఎన్టీఆర్ కథానాయకుడు అనే టైటిల్‌ను ఖారారు చేయగా, రెండో భాగానికి ఎన్టీఆర్ మహానాయకుడు అనే పేరు పెట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వివరాల్లోకి వెళితే..

    ఎన్టీఆర్ బయోపిక్‌ 100 కోట్ల బిజినెస్

    ఎన్టీఆర్ బయోపిక్‌ 100 కోట్ల బిజినెస్

    ఎన్టీఆర్ కథానాయకుడు అనే సినిమా విడుదలకు ముందే రూ.100 కోట్లకుపైగా బిజినెస్ చేయడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ సినిమా డిజిటిల్ హక్కులను రూ.25 కోట్లకు అమ్ముడుపోయాయి. డిజిటల్ రైట్స్ విషయంలో ఇది ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు. అలాగే బాలకృష్ణ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమంగా చెప్పుకొంటున్నారు.

    మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

    రికార్డు ధరకు థియేట్రికల్ రైట్స్

    రికార్డు ధరకు థియేట్రికల్ రైట్స్

    ఇక ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ సుమారు. 70 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ సినిమాను కొనుగోలు చేయడానికి డిస్టిబ్యూటర్లు భారీగా క్యూ కట్టినట్టు సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో పంపిణీ కోసం భారీగా డిమాండ్ వ్యక్తమైనట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

    ఏరియాల వారీగా హక్కులు

    ఏరియాల వారీగా హక్కులు

    ఇక ఈ సినిమాకు సంబంధించిన నైజాం హక్కులు రూ.13.5 కోట్లకు, సీడెడ్ ఏరియా హక్కులు రూ.12 కోట్లకు, ఓవర్సీస్ రైట్స్ రూ.10 కోట్లకు అమ్ముడపోయాయి. అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల హక్కులు రూ.5 కోట్లకు కొనుగోలు చేయడం సెన్సేషన్‌గా మారింది.

     ఓవరాల్‌గా రూ.125 కోట్లు

    ఓవరాల్‌గా రూ.125 కోట్లు

    తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోవడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి సుమారు.71 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే శాటిలైట్ హక్కులను రూ.25 కోట్లకు ప్రముఖ టెలివిజన్ ఛానెల్ దక్కించుకొన్నదని వార్తలు వెలువడుతున్నాయి. రిలీజ్‌కు ముందే సుమారు రూ.125 కోట్లు సినిమా రాబట్టడం చర్చనీయాంశమైంది.

     చిరంజీవిపై బాలకృష్ణ పైచేయి

    చిరంజీవిపై బాలకృష్ణ పైచేయి

    శాటిలైట్ హక్కుల విషయంలో ఎన్టీఆర్ బయోపిక్ సరికొత్త రికార్డును సొంతం చేసుకోవడం టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారి తీసింది. శాటిలైట్ హక్కుల విషయంలో చిరంజీవిపై బాలకృష్ణ సినిమా పైచేయి సాధించడం ఇదే తొలిసారి. చిరంజీవి నటిస్తున్న సైరా నర్సింహారెడ్డి కంటే ఎన్టీఆర్ బయోపిక్ అధికంగా బిజినెస్ చేయడం గమనార్హం.

    సైరా ధర కంటే ఎన్టీఆర్ బయోపిక్

    సైరా ధర కంటే ఎన్టీఆర్ బయోపిక్

    సైరా నర్సింహారెడ్డి సినిమా శాటిలైట్ హక్కులు సుమారు రూ.20 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్టు. ఇక బాలయ్య సినిమా హక్కులు రూ.25 కోట్లకు అమ్ముడు పోవడంతో ట్రేడ్ వర్గాల్లో భిన్న కథనాలు వినిపించాయి. చిరంజీవి సినిమాకు సాధ్యం కాని బిజినెస్ బాలకృష్ణకు కావడం సెన్సేషన్‌ అని పేర్కొంటున్నారు.

    English summary
    Tollywood is looking forward to two biopics, Balayya-starrer NTR Kathanayakudu and Chiranjeevi-starrer Sye Raa Narasimha Reddy. The satellite rights of Balayya's film have been sold for a price higher than that of Chiru's film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X