ఎన్టీఆర్ బయోపిక్‌లో కనిపించే 55 మంది ప్రముఖులు వీరే... ఎవరెవరు ఏ పాత్రలో?
సంక్రాంతి దగ్గర పడుతున్న కొద్దీ తెలుగు సినిమా ప్రేక్షకుల్లో 'ఎన్టీఆర్ బయోపిక్' చూడాలనే ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలు తెలుసుకునేందకు ఈ తరం యువత సైతం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్ 'యన్.టి.ఆర్ కథానాయకుడు'.. 'యన్.టి.ఆర్ మహానాయకుడు' అనే రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం జనవరి 9న, రెండో భాగం ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.
తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద తారాగణంగా తెరకెక్కుతున్న సినిమా మాత్రమే కాదు... ఇండస్ట్రీకి చెందిన ఎక్కువ మంది పాత్రలు ఈ చిత్రంలో కనిపించబోతుండటం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో ఎవరెవరు ఏ పాత్రలో కనిపించబోన్నారు అనే పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.

నందమూరి తారక రామారావు: బాలకృష్ణ
నందమూరి తారక రామారావు: బాలకృష్ణ
సాయికృష్ణ: గారపాటి శ్రీనివాస్
నందమూరి రామకృష్ణ: రోహిత్ భరద్వాజ్
అక్కినేని నాగేశ్వరరావు: సుమంత్
రామోజీరావు: గిరీష్
కన్నప్ప: సునీల్ కుమార్ రెడ్డి
డీ వీ నరసరాజు: శ్రీనివాస్ అవసరాల
కె రాఘవేంద్రరావు: కె ప్రకాష్

బసవరామతారకం: విద్యాబాలన్
బసవరామతారకం: విద్యాబాలన్
లోకేశ్వరి: పూనమ్ బజ్వా
భువనేశ్వరి: మంజిమామోహన్
పురంధేశ్వరి: హిమన్సీ
ఉమామహేశ్వరి: హీరోషిని కోమలి
కమలాకర్ కామేశ్వర రావు: ఎస్వీ కృష్ణారెడ్డి
ఇందిరాగాంధీ: సుప్రియా వినోద్
సి. నారాయణరెడ్డి: రామజోగయ్య శాస్ట్రీ
ఎమ్‌జి రామచంద్రన్: సికిందర్

రానా దగ్గుబాటి
నారా చంద్రబాబునాయుడు: దగ్గుబాటి రానా
నందమూరి త్రివిక్రమరావు: దగ్గుబాటి రాజా
ఎస్వీ రంగారావు: ఈశ్వర్ బాబు
మండలి వెంకటకృష్ణారావు: మండలి బుద్ధప్రసాద్
హెచ్‌ఎంరెడ్డి: కైకాల సత్యనారాయణ
దాసరి నారాయణరావు: చంద్ర సిద్ధార్థ్
సలీం మాస్టర్: రఘు మాస్టర్
దగ్గుపాటి వెంకటేశ్వరరావు: భరత్ రెడ్డి
చల్మేశ్వర్ రావు: నాగరాజ్
రూఖ్మాంగధ రావు: వెన్నెల కిషోర్

నందమూరి హరికృష్ణ: కళ్యాణ్ రామ్
నందమూరి హరికృష్ణ: కళ్యాణ్ రామ్
నాగిరెడ్డి: ప్రకాష్ రాజ్
ఆలూరి చక్రపాణి: మురళీ శర్మ
ఎల్వీ ప్రసాద్: జిషు సేనుగుప్త
కృష్ణకుమారి: ప్రణీత సుభాష్
వెంపటి చినసత్యం: శివ శంకర మాస్టర్

శ్రీదేవి: రకుల్ ప్రీత్ సింగ్
శ్రీదేవి: రకుల్ ప్రీత్ సింగ్
జయప్రద: హన్సిక మోత్వాని
ప్రభ: శ్రీయ
జయసుధ: పాయల్ రాజపుత్
రేలంగి: బ్రహ్మానందం
నాదెండ్ల భాస్కరరావు: సచిన్ ఖేదేకర్
బి ఏ సుబ్బారావు: నరేష్
పీ పుల్లయ్య: శుభలేఖ సుధాకర్
కేవీరెడ్డి: క్రిష్ జాగర్లమూడి
పీతాంబరం: సాయి మాధవ్ బుర్రా
బి విఠలాచార్య: ఎన్ శంకర్

సావిత్రి: నిత్యామీనన్
సావిత్రి: నిత్యామీనన్
యోగానంద్: రవిప్రకాష్
తాతినేని ప్రకాష్ రావు: ఇంటూరి వాసు
టీ వెంకటరాజు: సురభి జయచంద్ర
పేకేటి శివరాం: భద్రం
షావుకారు జానకి: షాలిని పాండే
పింగళి: సంజయ్ మార్కస్
బార్ట్లే: అర్జున ప్రసాద్
గుమ్మడి: దేవీ ప్రసాద్
జీ వరలక్ష్మీ: ప్రత్యూష
పుండరీకాక్షయ్య: నాగేశ్వరరావు


Click it and Unblock the Notifications











