twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్: శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్‌లుక్ అదిరిపోయింది!

    |

    Recommended Video

    NTR Biopic : First Look Of Rakul Preet As Sridevi Released

    సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన పాత్రలకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ 'కథానాయకుడు'లో రకుల్ శ్రీదేవి పాత్రలో కనిపించబోతోంది. అక్టోబర్ 10న రకుల్ పుట్టినరోజు సందర్భంగా ఆ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

    సీనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన పలు సూపర్ హిట్ చిత్రాల్లో శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా 14 సినిమాలు వచ్చాయి. 'వేటగాడు' సినిమాలో ఎన్టీఆర్-శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన 'ఆకుచాటు పిందు చూడు' అప్పట్లో సెన్సేషన్ హిట్ అయింది.

    అచ్చం శ్రీదేవిని చూసినట్లే ఉంది

    అచ్చం శ్రీదేవిని చూసినట్లే ఉంది

    తాజాగా విడుదల చేసిన రకుల్ ప్రీత్ సింగ్ లుక్... ‘వేటగాడు' సినిమాలో శ్రీదేవి లుక్ మాదిరిగా ఉంది. రకుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే.

     బాలయ్య-రకుల్ మీద ఆకుచాటు పిందె సాంగ్

    బాలయ్య-రకుల్ మీద ఆకుచాటు పిందె సాంగ్

    హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్లో రకుల్ ప్రీత్ సంగ్, బాలకృష్ణ మీద ఆకు చాటు పిందె చూడు సాంగ్ చిత్రీకరించనున్నాడు. బయోపిక్ ఫస్ట్ పార్టులో ఈ సాంగ్ సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు.

    రెండు భాగాలుగా బయోపిక్

    రెండు భాగాలుగా బయోపిక్

    దర్శకడు క్రిష్... ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. మొదటి భాగం అంతా ఎన్టీఆర్ సినిమా కెరీర్ మీదే పూర్తిగా ఫోకస్ పెడుతుండట. అందుకే ఎన్టీఆర్ నటించిన పాత సినిమాల్లోని సూపర్ హిట్ పాటలను ఈ మొదటి భాగంలో దర్శనమివ్వబోతున్నాయి.

    అభిమానినే శ్రీదేవి పాత్రపై రకుల్ ఏమన్నారంటే

    అభిమానినే శ్రీదేవి పాత్రపై రకుల్ ఏమన్నారంటే


    "ప్రస్తుతం అందరి కళ్లు నామీదే ఉన్నాయి. అందుకే శ్రీదేవి పాత్రలో నటించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఆమెకు నేను కూడా అభిమానినే. ఆమె పాత్రను వెండితెర మీద చూపించటం చాలా పెద్ద సాహసం. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది' అన్నారు

    ఎన్టీఆర్ బయోపిక్

    ఎన్టీఆర్ బయోపిక్

    ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు పార్టులుగా తీసుకురానున్నారు. పార్ట్ 1 'ఎన్టీఆర్ కథానాయకుడు', పార్ట్ 2 'ఎన్టీఆర్ మహానాయకుడు'గా తెరకెక్కనుంది. పార్టు 1ని సంక్రాంతి సందర్భంగా జనవరి 11న, పార్ట్ 2 2ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

    English summary
    NTR Biopic: First look of Rakul Preet as Sridevi released. In the pictures, Rakul Preet looks ethereal as well as naïve in a white saree and half-tied hair. Sharing the first look, film critic and trade analyst Taran Adarsh wrote, “Rakul Preet as #Sridevi... Rakul Preet portrays the part of the legendary actress in #NTRBiopic... While the first part [#NTRKathanayakudu] will release on 9 Jan 2019 [Wed], the second part [#NTRMahanayakudu] will release on 24 Jan 2019 [Thu]... Directed by Krish.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X