రావణబ్రహ్మగా బాలయ్య ఉగ్రరూపం.. అదరగొట్టేసిన విద్యాబాలన్.. అంగరంగ వైభవంగా!
Recommended Video

నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రం సినీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో బాలయ్య అచ్చు ఎన్టీఆర్ లా ఉన్నాడు. బాలయ్య హావభావాలు, ఆహార్యం మొత్తం చూస్తుంటే పూర్తిగా తన తండ్రి పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నాడు. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని డిసెంబర్ 21ని హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేస్తున్న పోస్టర్ ఆకట్టుకుంటున్నాయి.

బసవతారకంగా విద్యాబాలన్
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం చిత్ర యూనిట్ చాలా పెద్ద కసరత్తే చేసింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఈ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ని ఒప్పించారు. బాలయ్య స్వయంగా విద్యాబాలన్ తో సంప్రదింపులు జరిపారు. తాజాగా విద్యాబాలన్ లుక్ ని విడుదల చేశారు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయి నటించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్రలో ఉన్న బాలయ్య, విద్యాబాలన్ ని ఈ పోస్టర్ లో చూడొచ్చు.

రావణబ్రహ్మగా బాలయ్య ఉగ్రరూపం
ట్రైలర్, ఆడియో రేపే విడుదుల కానున్నాయి అని తెలియజేస్తూ రవాణబ్రహ్మ గెటప్ లో ఉన్న బాలయ్య లుక్ ని విడుదుల చేశారు. ఈ పౌరాణిక పాత్రలో బాలయ్య ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. నందమూరి అభిమానులు ఈ లుక్ ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పోషించిన ముఖ్యమైన పాత్రలు, రాజకీయనాకుడిగా ఆయన వేషధారణ ఇలా అన్ని కలుపుకుని బాలయ్య 60 కి పైగా గెటప్స్ లో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడట.

అంగరంగవైభవంగా ఆడియో లాంచ్
అంత్యత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని కూడా అంతే వైభవంగా నిర్వహించబోతున్నారు. ఆడియో లాంఛ్ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి బడా సెలెబ్రిటీలు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఆడియో వేడుకలోనే థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయనుండడంతో ఉత్కంఠ నెలకొంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య చెప్పే డైలాగుల కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

క్రిష్ దర్శత్వం
ఈ చిత్రంలో ఆసక్తికరమైన ఎన్నో పాత్రలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నాడు. శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తుండడం విశేషం. క్రిష్ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications











