ఓ మై గాడ్... రెండు కళ్లు చాలవేమో? చరిత్ర సృష్టించబోతున్న ‘ఎన్టీఆర్-కథానాయకుడు’
Recommended Video

ఇద్దరు లేదా ముగ్గరు స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తేనే మల్టీస్టారర్ అంటూ అభిమానులు తెగ మురిసిపోతారు. అలాంటిది పదుల సంఖ్యలో హీరోలు, హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అదొక అద్భుతం అనుభూతి అని చెప్పక తప్పదు. అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి కాంబినేషన్లు సాధ్యపడుతుంటాయి.
ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ఎన్టీఆర్ బయోపిక్' అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని అందించబోతోంది. ఎన్టీ రామారావు జీవితంలోని సినీ, రాజకీయ జీవితాన్ని ఫోకస్ చేస్తూ రెండు భాగాలుగా ఈ మూవీ తెరక్కుతోంది. ఆయన బాల్యం, సినీ జీవితంపై రూపొందిన 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, రాజకీయ జీవితంపై తెరకెక్కబోతున్న 'ఎన్టీఆర్-మహానాయకుడు' జనవరి 24న రాబోతోంది.

రెండు కళ్లు చాలవేమో?
‘ఎన్టీఆర్-కథనాయకుడు' రామారావు సినీ జీవితాన్ని ఫోకస్ చేసే చిత్రం కాబట్టి ఆయనతో వివిధ చిత్రాల్లో నటించిన హీరోయిన్ల పాత్రలు ఇందులో చూపించబోతున్నారు. దాదాపు 9 మంది హీరోయిన్లు మనకు తెరపై కనువిందు చేయబోతున్నారు. వీరిని చూడటానికి రెండు కళ్లు చాలవేమో? అంటున్నారు అభిమానులు.

రెండు భాగాల్లో నటిస్తున్న హీరోయిన్లు వీరే...
విద్యా బాలన్ (బసవతారకం పాత్రోలో), మాళవిక నాయర్ (కృష్ణ కుమారి), నిత్యా మీనన్ (సావిత్రి), శాలిని పాండే (శావుకారి జానకి), హన్సిక (జయప్రద), పాయల్ రాజ్ పుత్ (జయసుధ), రకుల్ ప్రీత్ సింగ్ (శ్రీదేవి)తో పాటు ఇషా రెబ్బ, దివ్యవాణి, ఆమని, పూనమ్ బజ్వా, మంజిమ మోహన్ తదితరులు నటిస్తున్నారు.

అతిపెద్ద తారాగణం రికార్డ్...
ఈ మధ్య కాలంలో సౌత్‌లో అత్యధిక మంది ప్రముఖ నటులు నటించిన సినిమా కూడా ఇదే అంటున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా... రానా దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రామ్, సుమంత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు మురళీ శర్మ, భాను చందర్, నరేష్, ప్రకాష్ రాజ్, సంజయ్ రెడ్డి, రవి కిషన్, వెన్నెల కిషోర్, భరత్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప చిత్రం
తెలుగు సినిమా చరిత్రలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు. సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయి ప్రభంజనం సృష్టించిన మహానాయకుడు కూడా. ఆయన జీవితంపై వస్తున్న సినిమా రావడంతో ఇది తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే గొప్ప చిత్రంగా ఉంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











