twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్‌పై క్లారిటీ.. రూమర్లకు చెక్.. సెన్సేషనల్ విషయాలు ఇవే..

    By Rajababu
    |

    Recommended Video

    Rana Daggubati To Play Nara Chandrababu Naidu Role In NTR Biopic

    టాలీవుడ్‌లో బయోపిక్‌ల నిర్మాణం జోరందుకున్నది. ఇప్పటికే మహానటి ఘన విజయం సాధించగా, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణకు సిద్ధమవుతున్నది. అలాగే బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవిత కథ ఆధారంగా హీరో సుధీర్ బాబు మరో బయోపిక్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్‌పై వస్తున్న రూమర్లకు చిత్ర యూనిట్ చెక్ పెట్టింది. అవేమిటంటే..

    రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్

    రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్

    గత కొద్దికాలంగా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వస్తుంది. ఫస్ట్ పార్ట్‌ను సంక్రాంతి 2019, రెండో భాగాన్ని 2019 మధ్య భాగంలో రిలీజ్ చేస్తారు అని మీడియాలో కథనాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం రెండు భాగాలు ఉండదు అని చిత్ర నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పారు.

    హైదరాబాద్‌లో జూలై 5 నుంచి

    హైదరాబాద్‌లో జూలై 5 నుంచి

    ఎన్టీఆర్ బయోపిక్ జూలై 5వ తేదీ నుంచి హైదరాబాద్ రామకృష్ణ సినీ స్టూడియోలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, స్వర్గీయ రామారావు సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తారు అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

    చంద్రబాబుగా రానా దగ్గుబాటి

    చంద్రబాబుగా రానా దగ్గుబాటి

    ఎన్టీఆర్ బయోపిక్‌లో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రను పోషించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషిస్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ మేరకు రానాతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని తెలిసింది.

    కృష్ణ, ఏఎన్నాఆర్ పాత్రల్లో

    కృష్ణ, ఏఎన్నాఆర్ పాత్రల్లో

    ఇక ఎన్టీఆర్ బయోపిక్‌లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు కూడా తన తండ్రి పాత్రలో, నాగచైతన్య తన తాత అక్కినేని పాత్రలో కనిపిస్తారు. సూపర్ స్టార్ కృష్ణ పాత్రను పోషించడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ చిత్ర తొలిభాగంలో సూపర్‌స్టార్ కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయని పేరొంటున్నారు.

    తేజ స్థానంలో క్రిష్ జాగర్లముడి

    తేజ స్థానంలో క్రిష్ జాగర్లముడి

    తొలుత ఎన్టీఆర్ బయోపిక్‌ కోసం దర్శకుడిగా తేజను అనుకొన్నారు. కొన్ని కారణాల వల్ల తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం జరిగింది. తేజ స్థానంలో గౌతమి పుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్ జాగర్లముడి దర్శకుడిగా రంగ ప్రవేశం చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150, మహానటి చిత్రాలకు మాటలు అందించిన బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి మాటల రచయితగా పనిచేస్తున్నారు.

    English summary
    The highly anticipated NTR biopic, which will star Nandamuri Balakrishna in the role of legendary NT Rama Rao, will hit the screens during the Sankranti festival next year. To be directed by Teja initially, it was confirmed on Monday that Krish Jagarlamudi will direct it. Nandamuri Balakrishna starrer NTR biopic was initially to be directed by Teja. However, it was confirmed on Monday that Gauthamiputra Satakarni director Krish Jagarlamudi would take over the reins. It is also said that Rana Daggubati may essay the role of Chief Minister of Andhra Pradesh, N Chandrababu Naidu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X