నిమ్మకూరులో బాలయ్య, క్రిష్ హంగామా!
ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో బాలయ్య, దర్శకుడు క్రిష్ సందడి చేశారు. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్నాడు. రెండు రోజుల షూటింగ్ నిమిత్తం బాలకృష్ణ, క్రిష్ తో పాటు ఎన్టీఆర్ చిత్ర బృందం నిమ్మకూరు తెలుస్తోంది.
చిన్న వయసులో ఎన్టీఆర్ తిరిగిన వీధులు, వాడలు ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారట. ఈ ఉదయమే నిమ్మకూరు చేరుకున్న బాలయ్య, క్రిష్.. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో దగ్గుబాటి రానా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. రానా, బాలయ్య, క్రిష్ కలసి నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి.
kaikala satyanarayana h m reddy vidya balan mokshagna ntr biopic balakrishna krish teja ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణ క్రిష్ తేజ


Click it and Unblock the Notifications