twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్‌కు చిక్కులు.. బాలయ్యకు కొత్త తలనొప్పి?

    |

    స్వర్గీయ నందమూరి రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్‌ను ఆయన తనయుడు బాలకృష్ణ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రతిష్టను, గౌరవాన్ని ఈ తరం ప్రేక్షకులకు తెలియజేప్పడమే కాకుండా, పాతతరం వారికి మహానుభావుడి కథను మరోసారి గుర్తు చేసేలా చేస్తున్నారు. షూటింగ్‌ దశలో రిలీజ్ చేస్తున్న పోస్టర్లు ఇప్పటికే క్రేజీగా మారాయి. ఇలా పాజిటివ్‌గా దూసుకెళ్తున్న తరుణంలో ఎన్టీఆర్ బయోపిక్‌కు, బాలకృష్ణ ముందు రాజకీయ చిక్కులు వచ్చిపడ్డాయి. అవేమిటంటే..

    ప్లాన్ మారింది: ఎన్టీఆర్ బయోపిక్‌లో యంగ్ టైగర్ నటించడం లేదు, కానీ...ప్లాన్ మారింది: ఎన్టీఆర్ బయోపిక్‌లో యంగ్ టైగర్ నటించడం లేదు, కానీ...

    కాంగ్రెస్ పార్టీపై ఎన్టీఆర్ పోరాటం

    కాంగ్రెస్ పార్టీపై ఎన్టీఆర్ పోరాటం

    దివంగత ఎన్టీఆర్ పోరాటమంతా కాంగ్రెస్, ఆ పార్టీ విధానాలపైనే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి ముందు, చేపట్టిన తర్వాత ప్రధాని ఇందిరా, రాజీవ్ గాంధీలపైనే ఎనలేని పోరాటం చేశారు. ఇందిరా గాంధీని ఎదురించే నేత లేని సమయంలో ఆమెను ధీటుగా ఎదుర్కొన్నాడు.

    ఎన్టీఆర్‌కే మహా ఘనత

    ఎన్టీఆర్‌కే మహా ఘనత

    ఎన్టీఆర్ చివరిశ్వాస వరకు కాంగ్రెస్ పార్టీనే రాజకీయ శత్రువుగా భావించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్‌ను స్థాపించారు. కాంగ్రెసేతర పార్టీలన్నీంటిని ఒకే తాటిపైకి తెచ్చారు. అలాంటి పోరాట ఘనత ఎన్టీఆర్‌కే చిక్కింది.

    ఎన్టీఆర్ దుయ్యబట్టే సీన్లు

    ఎన్టీఆర్ దుయ్యబట్టే సీన్లు

    ఇక ఎన్టీఆర్ బయోపిక్ విషయానికి వస్తే, రెండో భాగంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన సంఘటనలను ఉంటాయని పేర్కొంటున్నారు. సినిమాకు ముందు రాసిన స్క్రిప్టు ప్రకారం కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దుయ్యబట్టే సన్నివేశాలను రాశారని, దాని ప్రకారమే కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్టు సమాచారం.

    ప్రస్తుత రాజకీయాలతో

    ప్రస్తుత రాజకీయాలతో

    తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితులు ఎన్టీఆర్‌ బయోపిక్‌కు, బాలకృష్ణకు తలనొప్పిగా మారాయట. తెలంగాణలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌తో తెలుగు దేశం పార్టీ పొత్తు కుదుర్చుకోవడం ఈ సినిమాపై ప్రభావం చూపించేలా మారింది. స్క్రిప్టు ప్రకారం కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలను సంధిస్తే.. తెలుగు దేశం పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

    కీలక డైలాగుల్లో మార్పులు

    కీలక డైలాగుల్లో మార్పులు

    కాంగ్రెస్ పార్టీ నేతలు కుక్కమూతి పిందెలు అనే ఎన్టీఆర్ డైలాగ్ ఎంతో సెన్సేషన్. అలాంటి డైలాగ్‌లు లేకపోతే అంతగా పస ఉండదు. ఆ డైలాగ్‌ను అలాగే ఉంచితే టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందిగా మారే ఛాన్సు లేకపోలేదు. అందుకే కొన్ని తీవ్రమైన డైలాగుల్లో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తున్నది. డైలాగుల్లో మార్పు చేస్తే ఎన్టీఆర్ పాత్ర సెకండ్ పార్ట్‌లో పండుతుందా అనే మాట వినిపిస్తున్నది. అయితే డైలాగ్స్ మార్చారా లేదా అనే విషయం సినిమా రిలీజ్ అయితేగానీ తెలియదు.

    English summary
    The NTR biopic is the most anticipated film in Tollywood. Directed by Krish, it has N Balakrishna playing the lead role as NTR. After changed political situation in Telangana, Congress and TDP are allienced. Reports suggest that Some dialogues are changing according to present scenario.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X