twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2 టైటిల్ ఖరారు.. చరిత్ర అయితే మహానాయకుడు, రిలీజ్ డేట్ ఫిక్స్!

    |

    నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తన తండ్రి పాత్రలో స్వయంగా బాలయ్య నటిస్తున్నాడు. ఈ ఉదయం నుంచి చిత్ర యూనిట్ అభిమానులని ఆశ్చర్యపరుస్తూ సంచలన ప్రకటనలు చేస్తోంది. మొదట అంతా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఒక సినిమాగానే తెరకెక్కుతోందని భావించారు. కానీ ఎన్టీఆర్ జీవితంలో అద్భుతమైన మజిలీలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిని రెండున్నర గంటల సినిమాలో చూపించడం సాధ్యం కాదని భావించిన క్రిష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

     రెండు భాగాలుగా

    రెండు భాగాలుగా

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. తొలి భాగం టైటిల్ ఈ ఉదయమే దర్శకుడు క్రిష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి భాగం టైటిల్ ఎన్టీఆర్ కథానాయకుడుగా ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ నటజీవితానికి సంబందించిన అంశాలన్నీ ఈ భాగంలో చూపిస్తారు.

    సెకండ్ పార్ట్ టైటిల్

    ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం టైటిల్ ఎన్టీఆర్ మహానాయకుడుగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్, రానా ట్విటర్ లో ప్రకటించారు. ఆయన కథగా మారితే కథానాయకుడు.. ఆయనే చరిత్ర అయితే మహా నాయకుడు అంటూ రానా ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వైనాన్ని రెండవ భాగంలో చూపించబోతున్నారు.

    విడుదల తేదీలు ఖరారు

    విడుదల తేదీలు ఖరారు

    ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9, 2019 న విడుదల కానుంది. సెకండ్ పార్టీ ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని కొద్ది రోజుల గ్యాప్ లోనే జనవరి 24, 2019 న విడుదల చేయనున్నారు. రెండు భాగాలకు సంబందించిన షూటింగ్ ఒకేసారి పూర్తి కానుంది.

    Recommended Video

    Balayya's NTR Biopic Title Got Changed
    భారీ స్థాయిలో

    భారీ స్థాయిలో

    అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నాడు. ఏఎన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    NTR biopic Part 2 title announced. Release date also fixed. NTRKathanayakudu on Jan 9th and NTRMahanayakudu on Jan 24th
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X