»   »  ఎన్టీఆర్ బయోపిక్: చంద్రబాబు పాత్రలో ఎవరంటే...?

ఎన్టీఆర్ బయోపిక్: చంద్రబాబు పాత్రలో ఎవరంటే...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితంపై బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్‌లో జరిగింది. ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా వేడుక జరిపారు. ఈ చిత్ర నిర్మాణంలో బాలయ్య కూడా పాలు పంచుకోవడం విశేషం.

Balakrishna Emotional Speech On NTR Biopic Release
సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా

సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా

ఈ చిత్రంలో ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు పాత్ర కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబు పాత్రలో ఓ ప్రముఖ నటుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఆ నటుడు రాజశేఖరేనా?

ఆ నటుడు రాజశేఖరేనా?

చంద్రబాబు నాయుడు పాత్ర కోసం నటుడు రాజశేఖర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర చేయాలని బాలకృష్ణ అడగటం, వెంటనే రాజశేఖర్ కూడా ఒప్పుకోవడం కూడా జరిగిందట.

 పరిమితమైన పాత్ర మాత్రమే?

పరిమితమైన పాత్ర మాత్రమే?

రాజశేఖర్ పోషించే సిబిఎన్ పాత్ర పరిమితమైన పాత్ర అని, ఒకటి రెండు సీన్లలో మాత్రమే ఆయన కనిపిస్తారని అంటున్నారు. ఇందుకు సంబంధించి అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

చేయడానికి సిద్ధమే అని ప్రకటించిన రాజశేఖర్

చేయడానికి సిద్ధమే అని ప్రకటించిన రాజశేఖర్

రాజశేఖర్ నటించిన ‘గరుడ వేగ' చిత్రం ప్రమోషన్లలో బాలయ్య పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ బాలయ్య సినిమాలో చిన్న పాత్ర చేయడానికి అయినా సిద్ధమే అని అప్పట్లో ప్రకటించారు. ఇపుడు ఎన్టీఆర్ బయోపిక్‌లో అవకాశం రావడంతో వెంటనే ఒప్పేసుకున్నారట.

మహేష్ బాబు కూడా

మహేష్ బాబు కూడా

ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నారు? అయితే ఆయన ఎవరి పాత్రలో కనిపించబోతున్నారు? అనేది తెలియాల్సి ఉంది.

దసరాకు రిలీజ్

దసరాకు రిలీజ్

ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథ చదువుతుంటే ఒక సినిమా సరిపోదు, ఆరు సినిమాలు తీయాలి. అంత పెద్దగా ఉంది కథ. ఆరు సినిమాల కథ ఒక సినిమాలోకి తేవడానికి మాకు టైమ్ పడుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే దసరాకు రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం అని తేజ తెలిపారు.

English summary
NTR biopic will be having the role of NT Ramarao’s son-in-law Chandrababu Naidu who is the current day CM of Andhra Pradesh state. As per the latest updates, this role will be played by the yesteryear action hero Rajasekhar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X